Sekhar Master: డ్యాన్స్ మాస్టర్ డైరెక్షన్ బాట.. మెగా ఫోన్ పట్టనున్న కొరియోగ్రాఫర్

Sekhar Master: వెండి తెరమీద డ్యాన్సులు.. బుల్లి తెర మీద జడ్జిమెంట్లు.. శేఖర్ మాస్టర్ ఏదీ చేసినా సూపర్.. ఎవరినీ నొప్పించకుండా నవ్వుతూ సలహాలిస్తూ అందరినీ ఎంకరేజ్ చేస్తుంటారు. ఎంత బిజీగా ఉన్నా ఇంకా ఏదో చేయాలన్న తపనతో మెగా ఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు.
కొరియోగ్రాఫర్‌లు ఫిల్మ్‌మేకర్‌లుగా మారిపోయిన వాళ్లు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.. వారి సరసన ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా చేరిపోతున్నారు. కొందరు ఇంకా దర్శకులుగా కొనసాగుతుంటే, మరికొందరు మొదటి సినిమాతోనే డీలా పడిపోయారు. కొన్ని సంవత్సరాలుగా డ్యాన్స్ డైరెక్టర్‌లుగా ఉండటం వల్ల వారికి ఎమోషన్‌ను ఎలా చేయించాలో తెలుస్తుంది. అయితే సరైన కథను ఎంచుకుంటే వారు కూడా మంచి దర్శకులుగా గుర్తింపు తెచ్చుకుంటారు.
టాలీవుడ్‌లో ప్రభుదేవా, లారెన్స్, అమ్మ రాజశేఖర్, సన్నీ ఇలా చాలా మంది కొరియోగ్రాఫర్‌లు డైరెక్షన్ బాట పట్టారు. అయితే, ప్రభుదేవా ప్రారంభంలో విజయం సాధించగా, అతని గ్రాఫ్ కొంతకాలానికిపడిపోయింది. అదేవిధంగా, అమ్మ రాజశేఖర్.. లారెన్స్ హారర్-కామెడీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, ఇటీవలి కాలంలో అతడి చిత్రాలు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు శేఖర్ మాస్టర్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు.
శేఖర్ మాస్టర్ ఒక కథను రెడీ చేసి మొదటి షెడ్యూల్ పూర్తి చేసినట్లు సమాచారం. సినిమా ఫస్ట్‌కాపీని బయటకు తీసుకొచ్చే వరకు తాను దర్శకుడిగా పరిచయం అవుతున్న విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాలనుకున్నారు.
శేఖర్ చాలా మంది కొరియోగ్రాఫర్‌ల దగ్గర కూడా పనిచేసినప్పటికీ ప్రభుదేవా ఆయనకు ఆరాధ్య దైవంగా పేర్కొంటారు. అయితే, ప్రభు తన అరంగేట్రంకు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటే, శేఖర్ మాస్టర్ మాత్రం చాలా సైలెంట్‌గా సినిమా డైరెక్షన్ చేసేస్తున్నారు.. ఓ కొత్త డైరెక్టర్ నుంచి ఓ మంచి చిత్రాన్ని ఆశిస్తున్నారు ప్రేక్షకులు.. చూద్దాం శేఖర్ మాస్టర్ అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో. ఎనీ వే ఆల్ ది బెస్ట్ మాస్టర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com