Manohar: సీనియర్ నటుడు కన్నుమూత.. దిగ్భ్రాంతిలో కోలీవుడ్..

Manohar (tv5news.in)

Manohar (tv5news.in)

Manohar: ఇటీవల కాలంలో ఎంతోమంది సినీ సీనియర్ నటులు కన్నుమూస్తున్నారు.

Manohar: ఇటీవల కాలంలో ఎంతోమంది సినీ సీనియర్ నటులు కన్నుమూస్తున్నారు. ప్రేక్షకులను నవ్వించిన కమెడియన్లు, తమ నటనతో అలరించిన నటులు ఎందరో మన నుండి దూరంగా వెళ్లిపోయారు. అదే జాబితాలో చేరారు తమిళ సీనియర్ నటుడు మనోహర్. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు ఆర్‌ఎన్ఆర్ మనోహర్ ఇటీవల కన్నుమూశారు.

గతకొంతకాలంగా మనోహర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల శ్వాస సమస్యతో రావడంతో ఆయనను చెన్నైలోని ఆసుపత్రిలో చేర్చారు. ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రముఖ తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తూ సినీ కెరీర్‌ను ప్రారంభించారు మనోహర్.

అసిస్టెంట్ డైరెక్టర్ నుండి మెల్లగా నటుడిగా మారారు. ఎక్కువశాతం మనోహర్ నెగిటివ్ రోల్స్‌లోనే కనిపించేవారు. అంతే కాకుండా ఆయన రచయితగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశారు. మనోహర్ మృతికి తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తు్న్నారు.

Tags

Read MoreRead Less
Next Story