Naresh: నా కల నెరవేరింది.. స్పోర్ట్స్ కార్ కొనేశా.. : నరేశ్

Naresh: నా కల నెరవేరింది.. స్పోర్ట్స్ కార్ కొనేశా.. : నరేశ్
Naresh: స్పోర్ట్స్ కారు కొనడం తన కల కావచ్చు.. అందుకే ఆ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు.

Naresh: మొన్నటికి మొన్న ఖరీదైన క్యారవాన్ కొని వార్తల్లో నిలిచారు టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నరేష్.. మళ్లీ ఈరోజు స్పోర్ట్స్ కారు కొన్నాను నా కల నెరవేరింది అని పోస్ట్ పెట్టారు.. సాధారణంగా నటీ నటులకు ఖరీదైన లగ్జరీ కార్లు కొనడం హాబీ.. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన కారు తమ మనసు దోచేస్తే అది ఖచ్చితంగా తమ గ్యారేజీలో ఉండాల్సిందే..

అంత ఖరీదు పెట్టి కార్లు కొనడం వేస్ట్ అంటూనే నరేశ్ కార్ల మీద కార్లు కొనేస్తున్నారు.. సీనియర్ హీరో అయినా సినిమాల్లో అవకాశాలు బాగానే వస్తున్నాయి.. కష్టపడి సంపాదిస్తున్నప్పుడు కావలసినవి కొనుక్కుని ఆనందించడంలో తప్పులేదు.. స్పోర్ట్స్ కారు కొనడం తన కల కావచ్చు.. అందుకే ఆ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు.

తన కల నెరవేరిందని నరేశ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పర్పుల్ కలర్‌లో మెరిసిపోతున్న కారును డ్రైవ్ చేస్తూ నగర రోడ్లపై చకర్లు కొట్టి మురిసిపోతున్నారు నరేశ్. తన ప్రొఫైల్ పిక్ కూడా మార్చేశారు. కారు పక్కన నిలబడి దిగిన ఫోటోను పెట్టుకున్నారు.


Tags

Read MoreRead Less
Next Story