Rajababu: మరో సీనియర్ నటుడి కన్నుమూత..

Rajababu (tv5news.in)
Rajababu: ఇటీవల కాలంలో ఎందరో సీనియర్ నటీనటులను సినీ పరిశ్రమ కోల్పోయింది. తాజాగా సీనియర్ నటుడు రాజబాబు(64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజబాబు ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
1995లో వచ్చిన 'ఊరికి మొనగాడు' చిత్రంతో రాజబాబు నటుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అప్పటినుండి ఎన్నో సినిమాల్లో మర్చిపోలేని క్యారెక్టర్లు చేసి మెప్పించారు. సుమారు 62 పైగా చిత్రాల్లో ఆయన నటించారు. సినిమాల్లోనే కాదు సీరియల్స్‌తో కూడా ఆయన ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 2005లో 'అమ్మ' సీరియల్‌లో రాజబాబు చేసిన పాత్రకు నందీ అవార్డు కూడా అందుకున్నారు. అందరూ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే ఆయన ఇక లేరనే వార్త అందరినీ కలచివేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com