బతికే ఉన్నాను బాబు.. చంపకండి: సీనియర్ నటి శారద
Sarada: బతికే ఉన్నాను బాబు.. చంపకండి: సీనియర్ నటి శారదఅనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.. సీనియర్ యాక్టర్‌కి సుస్తీ.. ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు.. ఆమెకు ఏమైంది.. ఇలాంటివన్నా కొంత వరకు ఫరవాలేదు కానీ మరీ అత్యుత్సాహం ప్రదర్శించి నిజా నిజాలు తెలుసుకోకుండా బతికున్న ఓ మనిషిని నిర్ధాక్షణ్యంగా చంపేస్తారా బాబు అని సీనియర్ నటి శారద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు పనిగట్టుకుని రాసిన వార్తలు ఆమెని ఎంత బాధపెట్టి ఒక్క క్షణం ఆలోచించి ఉంటే బావుండేది. శారద స్వయంగా స్పందించి తాను బ్రతికే ఉన్నానని చెప్పుకోవలసి వచ్చింది. శారద కన్నుమూత అన్న వార్త చదివి ఇండస్ట్రీలోని ప్రముఖులు, అభిమానులు ఆందోళన చెందారు.
నిజం నిద్రలేచే లోపు అబద్ధం ఊరు దాటేస్తుందంటారు. అలాగే ఉంటాయి కొన్ని వార్తలు. కానీ ఓ మనిషి మరణ వార్త రాసేటప్పుడు, అందులో ప్రముఖుల గురించి రాసేటప్పుడు జాగ్రత్త వహించాల్సి అవసరం ఎంతైనా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నేను బ్రతికే ఉన్నాను. నా ఆరోగ్యం బాగానే ఉంది. కాకపోతే ఒంట్లో కాస్త నలతగా ఉంది.
దయచేసి వాట్సాప్‌లలో వచ్చే ఇలాంటి వాటిని నమ్మకండి. ఒక వ్యక్తి చేసిన పనికి అందరూ ఆందోళన చెందుతున్నారు. నా అభిమానులు, శ్రేయోభిలాషులు ఇలాంటి వార్తలు నమ్మొద్దు. నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలాంటివి వ్యాప్తి చేయడం బాధాకరం అని ఆమె పేర్కొన్నారు.
తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో నటించిన శారద మూడు సార్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు 76 ఏళ్ల శారద.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com