Sudha : సుందరం మాస్టర్ పై నటి సుధ షాకింగ్ కామెంట్స్..!

Sudha : సినీ నటి సుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అమ్మ పాత్రలంటే ముందుగా ఆమె గుర్తుకు వస్తుంది. దాదాపుగా 500 కి పైగా తెలుగు సినిమాలలో నటించిన సుధ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. సీనియర్ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ తనను దారుణంగా అవమానించాడని వెల్లడించింది.
సుధ మాట్లాడుతూ.. తమిళంలో ఓ సినిమా పాటను షూట్ చేస్తున్నప్పుడు సుందరం మాస్టర్ తనకి డ్యాన్స్ మూమెంట్ చెప్పారని, అయితే తనకి అర్ధం కాకపోవడంతో నాలుగైదు టేకులు తీసుకున్నానని చెప్పుకొచ్చింది. దీనితో అందరిముందు తనని అనరని మాట ఒకటి అన్నారని, దానిని తాను భరించలేకపోయానని చెప్పుకొచ్చింది.
దీనితో ఏడుస్తూ సెట్ నుంచి వెళ్లిపోయానని, చిన్న ఆర్టిస్టు అయినా.. పెద్ద ఆర్టిస్టు అయినా.. అలా అనడం తప్పుని వాపోయింది సుధ. ఇక అప్పటినుంచి ఆయన సినిమాలలో నటించకూడదని అనుకున్నానని తెలిపింది. కానీ ఆయన దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో తల్లి పాత్ర కోసం సుందరం మాస్టర్ తన దగ్గరకి వచ్చారని, ఆయనని చూడగానే సినిమా చేయనని చెప్పానని పేర్కొంది.
కానీ పశ్చాత్తాపం చెంది మీ వద్దకు వచ్చానని ఆయన చెప్పాక సినిమా చేసేందుకు ఓకే చెప్పానని తెలిపింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో రెండు పేజీల డైలాగ్ ఫస్ట్ షాట్ ఓకే అయిందని, అప్పుడు సుందరం మాస్టర్ తన దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పారని తెలిపింది. ఆ సినిమా తనకి మంచి పేరును తీసుకొచ్చిందని వెల్లడించింది సుధ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com