Ravi Teja's Irumudi : రవితేజ ఇరుముడిలో సీనియర్ నటి

Ravi Tejas Irumudi :  రవితేజ ఇరుముడిలో సీనియర్ నటి
X

మాస్ మహారాజ్ రవితేజ మూవీస్ తో రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా మూవీస్ చేస్తున్నాడు. అది కూడా నాన్ స్టాప్ గా. దాదాపు అరడజను ఫ్లాపుల తర్వాత భర్తలకు మహాశయులకు విజ్ఞప్తితో ఓ మామూలు విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీతో కొంత వరకు కమర్షియల్ గా కూడా రికవర్ అయ్యాడు. దీంతో ఇప్పుడు ఇమ్మీడియెట్ గా మరో మూవీ చేస్తున్నాడు. సినిమా టైటిల్ ఇరుముడి. ఈ టైటిల్ రవితేజ మూవీ అంటే చాలామంది ఆశ్చర్యపోయారు. కాస్త వైవిధ్యమైన కథతో వస్తున్నాడు అనిపించేలా ఉన్నాడు. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మూవీ ఇది.

ఇరుముడి అనగానే ఓ మళయాల మూవీకి ఇది రీమేక్ అనే టాక్ కూడా బలంగా ఉంది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అది అర్థం అయింది. ఇక తాజాగా వచ్చిన వార్తల ప్రకారం ఈ మూవీలో ఓ కీలకమైన పాత్రలో సీనియర్ నటి శోభన నటిస్తోంది. యస్.. శోభన ఇరుముడిలో నటించబోతోంది. ఒకప్పుడు హీరోయిన్ గా అద్భుతమైన సినిమాలతో అదరగొట్టింది శోభన. అయితే ప్రస్తుతం తను చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. అది కూడా అప్పుడప్పుడే చేస్తూ వస్తోంది. తన చివరి తెలుగు సినిమా కల్కి. కల్కిలో ఆమె పాత్ర చనిపోతుంది కూడా. ఆ తర్వాత ఇరుముడిలో నటించబోతోంది. మరి తన పాత్ర ఎలా ఉంటుందో అనేది తెలియాల్సి ఉంది.

Tags

Next Story