Radha Actress: లేట్ అయినా లేటెస్ట్‌గా మళ్లీ తెరపై అలనాటి తార..

Radha Actress (tv5news.in)
Radha Actress: అలనాటి హీరోయిన్లు అందరూ మెల్లగా వెండితెరపై ఫేడవుట్ అయిపోయినా కూడా ఏదో ఒక విధంగా ప్రేక్షకులను అలరించడానికి మళ్లీ వారి ముందుకు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు సీరియల్స్‌లో, షోస్‌లో అలనాటి అందాల తారలు అలరిస్తూనే ఉన్నారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో నటి చేరింది. తనే రాధ. 80ల్లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్‌లో రాధ కూడా ఒకరు. ఇప్పుడు ఆ రాధ వెండితెరపై నుండి బుల్లితెరపైకి వచ్చేసింది.
చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించి.. అప్పటి హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చింది రాధ. ముఖ్యంగా చిరంజీవి పక్కన తాను చేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్. కానీ రాధ హీరోయిన్‌గా వెండితెరపై ఎక్కువగా వెలిగింది కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. అయినా ఆ పది సంవత్సరాలలోనే అందరికీ గుర్తుండిపోయే ఇంపాక్ట్‌ను క్రియేట్ చేసింది.
తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలతో కూడా రాధ తన సత్తా చాటుకుంది. తన తర్వాత తన వారసులుగా ఇద్దరు కూతుళ్లను ఇండస్ట్రీలోకి దింపినా కూడా.. వారు తనలాగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. వెండితెరకు దూరమయిన చాలాకాలం తర్వాత రాధ.. బుల్లితెరపై అడుగుపెట్టింది.
తమిళంలోని ఒక ఫేమస్ డ్యాన్స్ షోలకు జడ్జ్‌గా రాధ.. తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. దాదాపు నాలుగు సీజన్లు ఆ డ్యాన్స్ షోకు తానే జడ్జి. ఆ తర్వాత పెద్దగా బుల్లితెరపై కూడా తాను కనిపించలేదు. ఇప్పుడు చాలాకాలం తర్వాత మరోసారి ఓ జూనియర్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్‌కు జడ్జిగా మారింది రాధ. ఈ షో ప్రోమోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ షోకు తాను జడ్జి అవ్వడం చాలా గర్వంగా ఉందని తెలిపింది.
After pretty long time , again as a judge for a reality show ! Nakul, my co judge is such a sweetheart ❤️That too on Zee Tamil! Enjoyed every bit of it! So proud to witness our talented girls!https://t.co/Kae1rQA7ax
— Radha Nair (@ActressRadha) January 11, 2022
@ZeeTamil
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com