Anchor Rashmi : యాంకర్ రష్మీ వాళ్ళ పేర్లు చెప్పి బెదిరించింది : సీనియర్ నిర్మాత కామెంట్స్

Anchor Rashmi : యాంకర్ రష్మీ వాళ్ళ పేర్లు చెప్పి బెదిరించింది : సీనియర్ నిర్మాత  కామెంట్స్
Anchor Rashmi : 'జబర్దస్త్' షోతో పాపులర్ అయిన యాంకర్ రష్మీ పలు సినిమాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే.

Anchor Rashmi : 'జబర్దస్త్' షోతో పాపులర్ అయిన యాంకర్ రష్మీ పలు సినిమాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఓ సినిమా విషయంలో రష్మీ తనని ఇబ్బంది పెట్టిందని టాలీవుడ్ సీనియర్ నిర్మాత బాలాజీ నాగలింగం అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రష్మీని తాను బెదిరించినట్లుగా వెల్లడించారు. అయితే అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఈ సందర్భంగా తెలిపారు.

వాస్తవానికి తాను ఎదుటివారిని తిట్టనని కోపం వస్తే కూడా దానిని అదుపు చేసుకుంటానని అన్నారు.. అయితే రష్మీ విషయంలోకి వచ్చేసరికి 'రాణి గారి బంగ్లా' అనే సినిమా చేయడానికి ఆమె ఓకే చెప్పిందని అన్నారు. షూటింగ్‌‌లో ఓ సాంగ్, డబ్బింగ్‌‌కి వచ్చేసరికి చేయను అంటూ ఇబ్బంది పెట్టిందని, హీరోని మార్చాలంటూ డిమాండ్ చేసిందని తెలిపారు. ఇదే విషయం పైన ఆమె ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే.. తనకి నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసునని చెప్పి బెదిరించిందని తెలిపారు.

అయితే తాను కూడా ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్నానని, తనకి కూడా నాగబాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు తెలుసునని ఎక్కడికైనా వచ్చి మాట్లాడేందుకు సిద్దేమేనని అన్నని తెలిపారు. తన వయస్సు ఎంత ఆమె వయస్సు ఎంత ఇలా మాట్లాడొచ్చా అని అన్నారు. రష్మీ తనతో మాట్లాడిన రికార్డింగ్ ఇప్పటికీ తన దగ్గర ఉందని, న్యాయం కోసమే ఆమెను ఫిల్మ్ ఛాంబర్ గేటుకు కట్టివేస్తానని బెదిరించానని తెలిపారు.

ఎట్టకేలకు వచ్చి మిగతా షూటింగ్ పూర్తి చేసిందని తెలిపారు. అయితే రష్మీ మంచి ఆర్టిస్ట్ అని అన్నారు.. సినిమా చేస్తున్నంత సేపు సెకండ్ టెక్ తీసుకోలేదని చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story