Adivi Sesh : గూఢచారి మళ్లీ వస్తున్నాడు

మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అడవి శేష్ టాలీవుడ్ లో తన ముద్రను బలంగా చూపించిన సినిమా గూఢచారి. అంతకు ముందు క్షణం అనే మూవీతో ఆకట్టుకున్నా.. గూఢచారితో ఎంటైర్ ఇండస్ట్రీ తనవైపు చూసేలా చేసుకున్నాడు. లిమిటెడ్ బడ్జెట్ తో అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించాడు. టెక్నికల్ గా బ్రిలియంట్ అనిపించుకున్నాడు. అప్పటి నుంచి అతని జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ‘డెకాయిట్’ అనే మూవీ చేస్తున్నాడు శేష్. శ్రుతి హాసన్ హీరోయిన్ గానే కాక అతనికి అపోనెంట్ గానూ కనిపించబోతోందీ మూవీలో. ఆ మధ్య విడుదల చేసిన డెకాయిట్ వీడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే శేష్ ఎన్ని మూవీస్ చేసినా.. చేస్తున్నా.. గూఢచారికి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. వారి కోసమే ఈ న్యూస్.
గూఢచారికి సీక్వెల్ ఉంటుందని ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లోనే హింట్ ఇచ్చాడు శేష్. ఆ మూవీ రిలీజ్ అయి ఇప్పటికి ఆరేళ్ళవుతోంది. ఈ సందర్భంగా అంతా ఎదురు చూస్తోన్నఅప్డేట్ ఇచ్చాడు శేష్. గూఢచారికి సీక్వెల్ రెడీ అవుతోందట. పైగా వచ్చే యేడాది సమ్మర్ లో రిలీజ్ చేస్తాం అన్న స్వీట్ న్యూస్ కూడా చెప్పాడు. నిజానికి ఈ సెకండ్ పార్ట్ కు సంబంధించిన కథను అబ్బూరి రవి ఆల్రెడీ సిద్ధం చేసి ఉన్నా అని గతంలోనే చెప్పాడు. సో.. వీళ్లు షూటింగ్ మొదలుపెట్టారని అర్థం అవుతోంది కదా. ఇప్పుడు స్టార్ట్ చేసి ఉంటేనే 2025 సమ్మర్ వరకూ విడుదల చేయగలరు. సో.. గూఢచారి 2 రాబోతోంది. దీనికంటే ముందే డెకాయిట్ విడుదలవుతుందని వేరే చెప్పక్కర్లేదేమో కదా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com