Mythili : నా భర్త శ్రీధర్‌రెడ్డి వల్లే చావడానికి సిద్ధపడ్డాను : మైథిలీ

Mythili : నా భర్త శ్రీధర్‌రెడ్డి వల్లే చావడానికి సిద్ధపడ్డాను :  మైథిలీ
Mythili : ఆత్మహత్యాయత్నంపై స్పందించింది సీరియల్‌ నటి మైథిలీ. భర్త శ్రీధర్‌రెడ్డి, పంజాగుట్ట పోలీసుల వల్లే చావు అంచుల వరకు వెళ్లొచ్చానని ఆవేదన వ్యక్తం చేసింది.

Mythili : ఆత్మహత్యాయత్నంపై స్పందించింది సీరియల్‌ నటి మైథిలీ. భర్త శ్రీధర్‌రెడ్డి, పంజాగుట్ట పోలీసుల వల్లే చావు అంచుల వరకు వెళ్లొచ్చానని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నో ఆశలతో శ్రీధర్‌రెడ్డిని పెళ్లి చేసుకుంటే.. వేరే మహిళతో సంబంధం పెట్టుకుని తనను మోసం చేశాడని వాపోయింది. కట్నం డబ్బులు, నగలు తీస్కెళ్లి జల్సాలు చేస్తూ నన్ను వదిలేశాడని ఆరోపించింది. 8నెలలుగా పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు సైతం తన భర్తకు సపోర్ట్‌ చేస్తూ హింసించారని ఆరోపించింది మైథిలీ. తన కూతురు ఈ పరిస్థితుల్లో ఉండటానికి అల్లుడు శ్రీధర్‌రెడ్డే కారణమన్నారు మైథిలీ తండ్రి ఎల్లారెడ్డి. 200సార్లు స్టేషన్‌చుట్టూ తిరిగినా పంజాగుట్ట పోలీసులు కనికరించలేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story