నిర్మాతపై నటి షాకింగ్ కామెంట్స్.. వ్యభిచారం చేయిస్తున్నా డంటూ..

సీరియల్స్, సినిమాల్లో నటించేవాళ్లంటే అందరికీ చిన్న చూపు.. ఇటీవల, ఒక సీరియల్ నటి తన భర్తను కోల్పోయి తన ఇద్దరు పిల్లలతో చెన్నైలో ఉంటూ టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. ఓ నిర్మాత తనను వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. అతడు ఇప్పటికే అనేక మంది అమ్మాయిలను మోసం చేశాడని, ఓ బాలికపై అత్యాచారం చేసినందుకు పోక్సో చట్టం కింద కేసుపెట్టి అతడిని అరెస్ట్ చేశారని ఆమె తెలిపారు. అయినా అతడు తన బుద్దిని మార్చుకోలేదు..
కొందరు అమ్మాయిలు అతడి మాయమాటలకు మోసపోతున్నారు. అవకాశాల కోసం వచ్చిన వారిని అతడి చుట్టూ తిప్పించుకుంటున్నాడు.. వారిని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు.
సినీ నిర్మాతనని చెప్పి పెళ్లి చేసుకొన్నాడు. బలవంతంగా తన చేత వ్యభిచారం చేయిస్తున్నాడని క్యారెక్టర్ ఆర్టిస్ట్ పరమేశ్వరి అలియాస్ భైరవి చెన్నైలో డీజీపీకి ఫిర్యాదు చేసింది. వేలూరుకు చెందిన రాజా దేసింగ్ అలియాస్ సుబ్రమణి నిర్మాతగా పలు సీరియళ్లు చేస్తున్నాడు. తనను మోసం చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని,. అనంతరం తనపై ఒత్తిడి తెచ్చి డబ్బు కోసం తన చేత వ్యభిచారం చేయిస్తున్నట్లు వెల్లడించింది.
తనతో పాటు తన పిల్లలను కూడా ఆ వృత్తి చేయమని ఒత్తిడి చేస్తున్నాడని చెప్పింది. అతడి నుంచి విడిపోయి పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్నట్లు తెలిపింది. అయితే.. తాను చెప్పినట్లు చేయకుంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడని రాజాదేసింగ్ పై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com