Devara Song : దేవర సాంగ్పై దారుణమైన ట్రోల్స్.. మండిపోతున్న ఫ్యాన్స్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. తాజాగా ఈ సినిమా నుండి దావూదీ అనే మూడో పాటను విడుదల చేశారు మేకర్స్. స్టైలీష్ బీట్ తో వచ్చిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ పాటపై తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది. నిజానికి సాంగ్ రిలీజైన తర్వాత కాసేపటి వరకూ.. బీట్ అదిరింది, సాంగ్ సూపర్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేశారు.
కానీ, కాసేపటికి అసలు ట్రోల్స్, మీమ్స్ మొదలయ్యాయి. పాట బీటు నుంచి ట్యూన్, స్టెప్స్ వరకు అన్నీ కాపీ కొట్టేశారంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. తమిళ స్టార్ దళపతి విజయ్ నటించిన 'బీస్ట్' సినిమాలో హల్మితి హబీబో పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట, అందులో విజయ్ వేసిన స్టెప్పులు అప్పట్లో తెగ ట్రెండ్ అయ్యాయి. ఈ పాటని జానీ మాస్టర్ కంపోజ్ చేశారు. అయితే.. తాజాగా దేవర నుంచి వచ్చిన దావూదీ సాంగ్ బీటు కూడా అలానే ఉందని, స్టెప్పులు కూడా ఆల్ మోస్ట్ అలానే ఉన్నాయంటూ నెటిజన్లు రెండు సాంగ్స్‌ను కంపేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఇక దావూదీ పాటను శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశారు. దాంతో.. పక్కవాళ్ళ స్టెప్పులు కాపీ చేయడమేంటంటూ నెటిజన్లు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ శేఖర్ మాస్టర్‌పై ఫైర్ అవుతున్నారు. ఢీ షోలో జడ్జీగా వెళ్లి అక్కడి కంటెస్టెంట్ల స్టెప్పులు కాపీ కొట్టేసి సినిమాల్లో పెట్టేయడం శేఖర్ మాస్టర్‌కి అలవాటు అయిపోయిందంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.మరోపక్క దేవర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ను కూడా ఏకిపారేస్తాన్నారు.తమన్‌లానే అనిరుధ్ కూడా పెద్ద కాపీ మాస్టర్ అయిపోయాడంటూ మీమ్స్ చేస్తున్నారు. ఇక ఎన్ని ట్రోల్స్, మీమ్స్ వచ్చినా.. సాంగ్ మాత్రం యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్ చేస్తోంది. ట్యూన్ పెద్దగా ఎక్కకపోయినా.. తారక్ డ్యాన్స్, జాన్వీ గ్లామర్, ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కు కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. సాంగ్ ను రిపీట్ మోడ్ లో వింటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com