Vijay Babu: నటిపై లైంగిక వేధింపులు.. ఆ అమ్మాయిని విడిచిపెట్టేదే లేదంటూ నటుడి వార్నింగ్..

Vijay Babu: నటిపై లైంగిక వేధింపులు.. ఆ అమ్మాయిని విడిచిపెట్టేదే లేదంటూ నటుడి వార్నింగ్..
Vijay Babu: 'తనను అంత సులువుగా వదిలిపెట్టను. నేను నా దగ్గర ఉన్న ప్రూవ్స్ అన్నీ బయటపెట్టగలను'.

Vijay Babu: మలయాళ నటుడు విజయ్ బాబుపై లైంగిక వేధింపుల కేసు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతే కాకుండా ఓ నటి తనపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన కారణంగా తనకు విజయ్ బాబు ఫేస్‌బుక్ లైవ్‌లో వార్నింగ్ ఇవ్వడం మరో సంచలనంగా మారింది. అసలు ఇంతకీ ఈ కేసులో నిందితులు ఎవరు, బాధితులు ఎవరు అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.

విజయ్ బాబు తనను లైంగికంగా వేధించాడని, తను ఒప్పుకోకపోతే దాడి చేశాడంటూ ఓ నటి.. విజయ్ బాబుపై పోలీస్ కేసు పెట్టింది. అంతకంటే ముందు ఈ విషయాన్ని తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఏప్రిల్ 22న పోలీసులను ఆశ్రయించిన నటి.. గత నెలరోజులుగా విజయ్ బాబు తనపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది.


అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి సినీ పరిశ్రమలోకి వచ్చే అమ్మాయిలను కొందరు లైంగికంగా వేధిస్తున్నారు. తాను కూడా అలాంటి ఒక బాధితురాలినే అంటూ నటి పేర్కొంది. విజయ్ బాబు దగ్గర తాను నగ్నంగా ఉన్న వీడియో ఒకటి ఉందని.. దాంతో అతడు తనని బెదిరిస్తున్నాడని పేర్కొంది. కానీ ఇప్పుడు తనకు న్యాయం దొరుకుంది అని నమ్మకంతో ఈ విషయాన్ని బయటపెడుతున్నానంటూ తెలిపింది.


ఈ విషయంపై విజయ్ బాబు ఫేస్‌బుక్ లైవ్‌లో స్పందించాడు. 'నేను ఏ తప్పు చేయలేదు. నేనే ఇక్కడ బాధితుడిని. మన దేశంలో ఉన్న న్యాయశాస్త్రం తనను రక్షించే ప్రయత్నం చేస్తోంది. కానీ ఇక్కడ ఎక్కువ బాధపడుతుంది నేను. నేను పరువునష్టం దావా వేస్తాను. తనను అంత సులువుగా వదిలిపెట్టను. నేను నా దగ్గర ఉన్న ప్రూవ్స్ అన్నీ బయటపెట్టగలను కానీ తన కుటుంబానికి ఇబ్బంది కలిగించాలన్న ఉద్దేశ్యం నాకు లేదు'. అన్నాడు విజయ్ బాబు.

'నేను నా భార్య, తల్లి, సోదరికి మాత్రమే సమాధానం చెప్పుకోవాలి. అయినా ఈ విషయాన్ని విజయ్ బాబు నిందితుడు కాదు అని తేల్చే చిన్న వార్తతో నేను వదిలిపెట్టను. ఆ అమ్మాయి ఆడిషన్‌కు వచ్చింది. పాత్ర దక్కించుకుంది. క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలు తను కాదు నేను. తను డిప్రెషన్‌లో ఉన్నానంటూ పంపిన మెసేజ్‌లు, 400 స్క్రీన్‌షాట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి.' అని తెలిపాడు విజయ్ బాబు.


ఇక ఈ ఫేస్‌బుక్ లైవ్‌లో ఆ అమ్మాయి పేరు బహిరంగంగా చెప్పేశాడు విజయ్ బాబు. అయితే రేప్ కేసులో బాధితురాలిగా ఉన్న ఏ అమ్మాయి పేరు బహిరంగంగా చెప్పకూడదు అన్న కారణంగా విజయ్ బాబుపై మరో కేసు కూడా నమోదయ్యింది. ప్రస్తుతం మాలీవుడ్‌లో వీరిద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారు. ఎవరు అబద్ధం చెప్తున్నారు అనే చర్చ నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story