Bollywood Badshah: 31 ఏళ్ల సినీ ప్రస్థానం

Bollywood Badshah: 31 ఏళ్ల సినీ ప్రస్థానం
X
చిన్నా చితకా పనులు చేస్తూ అవకాశాల కోసం ఎదురు చేసేవాడు


బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ సినీ జర్నీ 31వసంతాలను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 7తో షారూఖ్ ఖాన్ సినీ ఇండస్ట్రీకి వచ్చి 31సంవత్సరాలు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులతో చిట్ చాట్ చేశారు. #AskSRK అనే కార్యక్రమంలో మాట్లాడిన ఆయన అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. ఓ మహిళా అభిమాని మాట్లాడుతూ... "నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నాను. డాక్టర్ కవలపిల్లలని చెప్పారు. వారిలో ఒకరికి పఠాన్ అని, మరొకరికి జవాన్ అని పేర్లు పెడతాను"అని అన్నారు. అందుకు షారూక్ స్పందిస్తూ ఇంకా మంచి పేర్లు పెట్టవచ్చన్నారు.

మరో అభిమాని తన స్నేహితుడికోసం జవాన్ లో పాత్ర ఇవ్వాలని కోరాడు. అలాచేయడం కుదరదని తన స్నేహితుడికి అర్థం అయ్యేలా చెప్పాలని, థియేటర్‌లో ఎంజాయ్ చేయండని షారూక్ చెప్పాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యిందని చెప్పిన కొందరి నెటిజన్స్‌కు ఆల్ ది బెస్ట్.. జీవితంలో మీరు నేర్చుకుంది ఉపయోగపడుతుందని అని సమాధానం ఇచ్చాడు.

షారూక్ ప్రయాణం...
షారూక్ ఖాన్ తన కెరీర్ ను చాలా చిన్నస్థాయి నుంచి మొదలు పెట్టారు. 1965లో పుట్టిన ఆయనకు చిన్నప్పటి నుంచి స్క్రీన్ పై కనిపించడం అంటే చాలా ఇష్టం. అందుకు అనుగుణంగా తనను తాను మలుచుకునే వాడు. ఢిల్లీలో జన్మించిన ఆయన.. చదువు పూర్తయ్యాక యాక్టర్ అవ్వాలని ముంబైకి వెళ్లాడు. మొదట్లో పని దొరక్క ఇబ్బంది పడ్డ ఆయన చిన్నా చితకా పనులు చేస్తూ అవకాశాల కోసం ఎదురు చేసేవాడు.

1988లో ప్రముఖ టీవీ షో 'ఫౌజీ'లో నటించారు షారూక్. ఆ తర్వాత 1992 'దీవానా' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయింది. తొలి సినిమాకు బెస్ట్ యాక్టర్ గా అవార్డును అందుకున్నాడు. ఆపై 'బాజీగర్', 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే', 'దిల్ తో పాగల్ హై' వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. 'కుచ్ కుచ్ హోతా హై' , 'మొహబ్బతేన్' , 'దేవదాస్' వంటి అనేక బ్లాక్ బస్టర్ హిట్‌లతో షారుఖ్ కెరీర్ కొనసాగింది. దీంతో పాటే 'రెడ్ చిల్లీస్' పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఇది అనేక విజయవంతమైన చిత్రాలను, టీవీ షోలను నిర్మించింది.

బాలీవుడ్ లో అంత్యంత సక్సెస్ ను సాధించిన హీరోగా షారూక్ పేరు తెచ్చుకున్నారు. భారత్ కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 14 ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు... భారత ప్రభుత్వంచే పద్మశ్రీ, పద్మభూషన్ అవార్డులను కూడా అందుకున్నారు.


Tags

Next Story