Shah Rukh Khan: షారూఖ్ లతాజీ పాదాల దగ్గర ఉమ్మేశాడా? మండిపడ్డ నటి ఊర్మిళ..

Shah Rukh Khan: ఇండియన్ నైటింగేల్‌గా పేరు తెచ్చుకున్న ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్.. ఆదివారం కన్నుమూశారు. ఎన్నో సంవత్సరాలుగా తన జీవితాన్ని పాటలకే అంకితం చేసిన లతా మంగేష్కర్ అంత్యక్రియలకు దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ సెలబ్రిటీలు ఎందరో తరలి వచ్చారు. అలాగే షారూఖ్ కూడా లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించారు. కానీ ఈయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా సీనియర్ నటి ఊర్మిళ దీనిపై రియాక్ట్ అయ్యారు.
షారూఖ్ ఖాన్, తన సెక్రటరీ పూజా దడ్లానీతో లతా మంగేష్కర్ అంత్యక్రియలకు హాజరయ్యాడు. చేతులు నమస్కరించి నివాళులు అర్పించాడు. ఆ తర్వాత మాస్క్‌ను దించి లతాజీ పాదాలపై ఊదాడు. దీనిని తప్పుగా అర్థం చేసుకున్న నెటిజన్లు.. షారూఖ్ లతాజీ సమాధిపై ఊదాడు. ఇది ప్రార్థనలో ఒక భాగమని తెలియక చాలామంది షారూఖ్‌పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
షారూఖ్‌పై వస్తు్న్న నెగిటివ్ కామెంట్స్‌కు తాను రియాక్ట్ అవ్వకపోయినా సీనియర్ నటి ఊర్మిళ మాత్రం తన ఫ్రెండ్ షారూఖ్‌కు తోడుగా నిలబడింది. ప్రార్థనను కూడా ఉమ్మివేయడం అనుకుంటున్న సమాజంలో బతుకుతున్నామన్నారు ఊర్మిళ. ఇండియన్ సినిమాను అంతర్జాతీయ ప్లాట్‌ఫార్మ్స్‌లో నిలబెట్టిన షారూఖ్ గురించి ఇలా మాట్లాడుతున్నారని గుర్తుపెట్టుకోమన్నారు. అంతే కాకుండా లతా మంగేష్కర్ మతి పట్ల సంతాపం తెలుపుతూ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఊర్మిళ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com