Shah Rukh Khan: 'నేను ఆ సౌత్ హీరోకు పెద్ద ఫ్యాన్': షారుక్ ఖాన్

Shah Rukh Khan (tv5news.in)

Shah Rukh Khan (tv5news.in)

Shah Rukh Khan: షారుక్ ఖాన్ తన తరువాతి సినిమాను తమిళ దర్శకుడు అట్లీతో ప్లాన్ చేసుకున్నాడు.

Shah Rukh Khan: ఒకప్పుడు సౌత్, నార్త్ అంటూ సినీ పరిశ్రమలో మధ్య ఉండే వ్యత్యాసం కొంచెంకొంచెంగా తగ్గిపోతోంది. నార్త్‌కంటే ఎక్కువగా సౌత్ సినిమాలకే క్రేజ్ పెరిగిపోయింది. అందుకే నార్త్ నటీనటులు సైతం సౌత్‌లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడి హీరోలు వారికి ఫేవరెట్ అంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కూడా తానొక తమిళ హీరోకు ఫ్యాన్ అని బయటపెట్టాడు.

బాలీవుడ్ హీరోల్లో ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి.. ఎనలేని స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న హీరోల్లో షారుక్ ఖాన్ కూడా ఒకరు. ఈ హీరో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌ను సృష్టించాయి. ఈమధ్య ఎక్కువగా ప్రయోగాల వైపు అడుగులేస్తూ.. సినిమాల విషయంలో స్లో అయ్యాడు షారుక్ ఖాన్. ఈ బాలీవుడ్ బాద్‌షా తన తరువాతి సినిమాను తమిళ దర్శకుడు అట్లీతో ప్లాన్ చేసుకున్నాడు. తాజాగా ఓ తమిళ హీరోపై షారుక్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

తమిళ హీరో విజయ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అప్‌కమింగ్ మూవీ 'బీస్ట్' కోసం దేశవ్యాప్తంగా విజయ్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇటీవల విడుదలయిన బీస్ట్ ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచేస్తోంది. ఈ ట్రైలర్‌పై తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశాడు షారుక్ ఖాన్.

'నాలాగే యాక్టర్ విజయ్‌కు పెద్ద ఫ్యాన్ అయిన అట్లీతో పనిచేస్తు్న్నాను. బీస్ట్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది' అని విజయ్‌ను, బీస్ట్ ట్రైలర్‌ను ప్రశంసలతో ముంచేశాడు షారుక్. ఒక తమిళ హీరోకు తాను పెద్ద ఫ్యాన్ అంటూ షారుక్ వేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా అంతా చక్కర్లు కొడుతోంది. ఇక బీస్ట్ సినిమా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 13న విడుదల కానుంది.

Tags

Next Story