Jawan: బాలీవుడ్ లో రికార్డు సృష్టించబోతున్న షారుఖ్ ఖాన్

Jawan: బాలీవుడ్ లో రికార్డు సృష్టించబోతున్న షారుఖ్ ఖాన్
X
త్వరలో రూ.1000కోట్ల క్లబ్ లోకి 'జవాన్'..!

షారుఖ్ ఖాన్ జవాన్ 'పఠాన్' తర్వాత 'జవాన్' ఇటీవలే రిలీజై .. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయింది. దీంతో షారుఖ్ ఒక్క సంవత్సరంలోనే వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ లు సొంతం చేసుకున్న నటుల జాబితాలో చేరి రికార్డు సృష్టించారు.. ఇక ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతున్న 'జవాన్'.. మొదటి మూడు రోజుల్లో నమోదైన కలెక్షన్లను బట్టి చూస్తుంటే.. త్వరలోనే ఇది రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. ఇది కూడా 'పఠాన్' బాటలోనే నడుస్తోందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో అన్నీ సజావుగా జరిగితే, 'జవాన్' ఈ ఘనత సాధించిన SRK రెండవ చిత్రం అవుతుంది. ఒకే సంవత్సరంలో రెండు చిత్రాలు రూ. 1,000 కోట్ల క్లబ్‌లో చేరినవిగా రికార్డ్ సృష్టించనున్నాయి. అదే గనక నిజమైతే.. బాలీవుడ్ చిత్రసీమలో ఈ ఘనత సాధించిన మొదటి నటుడు షారుఖే అవుతాడు.

అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. దాని కంటే ముందు టిక్కెట్ విక్రయాల గణాంకాలే ఈ సినిమా విజయాన్ని దాదాపు ఖరారు చేశాయి. జవాన్ మొదటి రోజున రూ.65.50 కోట్లు రాబట్టింది, ఇది 'పఠాన్' కంటే దాదాపు 19 శాతం ఎక్కువ. అయితే, మరుసటి రోజు శుక్రవారం సెలవు దినం లేని కారణంగా గణాంకాలు పడిపోయాయి, అయితే ఈ చిత్రం శనివారం మళ్లీ పుంజుకుని రూ. 68.72 కోట్లు వసూలు చేసింది. మూడు రోజుల తర్వాత, మొత్తం నికర వసూళ్లు ప్రస్తుతం రూ.180.45 కోట్లుగా ఉన్నాయి, ఇది 'పఠాన్' కంటే దాదాపు రూ.20 కోట్లు ఎక్కువ. ఇదే స్పీడ్ కొనసాగితే, మరికొద్ది రోజుల్లో పెద్దగా రిలీజ్‌లు ఏమీ లేవు కాబట్టి, మరికొద్ది రోజుల్లోనే ప్రతిష్టాత్మకమైన రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరిపోతుంది.

'జవాన్' లో SRK కాకుండా, నయనతార, సునీల్ గ్రోవర్ , సన్యా మల్హోత్రా, విజయ్ సేతుపతి కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. 'థెరి' (2016), 'మెర్సల్' (2017) చిత్రాలకు దర్శకత్వం వహించిన అట్లీ కుమార్‌తో షారుఖ్ ఖాన్ కలిసి చేసిన మొదటి చిత్రం ఇది. ఈ చిత్రంలో, షారుఖ్ ఖాన్ ద్విపాత్రాభినయం చేశాడు. ఆయన ఈ మూవీలో అనేక విభిన్న అవతారాలు, లుక్స్‌లో కనిపిస్తాడు.

Tags

Next Story