Shah Rukh Khan : సినిమా లొకేషన్లోనే చనిపోవాలి .. షారుఖ్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్

Shah Rukh Khan : సినిమా లొకేషన్లోనే చనిపోవాలి .. షారుఖ్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్
X

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఆయన లోకర్నో ఫిల్మ్‌ ఫెస్టివెల్‌ లో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన దర్శకులకు, నిర్మాతలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన తన సినీ జర్నీ గురించి మాట్లాడుతూ "నేను 23ఏళ్ల వయసులో నటుడిని అయ్యాను. 27 ఏళ్లకే హీరో అయ్యాను. ఈ 36ఏళ్ల ప్రయాణంలో ఎన్నో అనుభవాలు. దేవుడు నాకు అద్భుతమైన జీవితాన్నిచ్చాడు, కోట్లాది మంది అభిమానులను ఇచ్చాడు. అనుకున్నదానికంటే ఎక్కువే ఇచ్చాడు. నా చివరి కోరిక ఒకటే. నేను జీవితాంతం నటుడిగానే కొనసాగాలి. ఏదైనా సినిమా సెట్‌లో దర్శకుడు యాక్షన్‌ చెప్పగానే చనిపోవాలి. కట్‌ చెప్పాక కూడా లేవకూడదు. అలా నా జీవితానికి ముగింపు పడాలి” అంటూ చెప్పుకొచ్చాడు షారుఖ్. ప్రస్తతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షారుఖ్ నోటి నుంచి ఆ మాటలు విన్న తన ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు

Tags

Next Story