Pathan : 'బాయ్‌కాట్ పఠాన్'ను ఎదుర్కోవడానికి షారుఖ్ ఖాన్ కొత్త ఐడియా..

Pathan : బాయ్‌కాట్ ట్రెండ్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో భూతంలా మారింది. ఎవరిని ఈ బాయ్‌కాట్ ఆవహంచినా వారి సినిమాలు బోల్తా కొట్టడం ఖాయం. బాలీవుడ్ బాద్‌షా మూవీ 'పఠాన్' కూడా అందుకు మినహాయింపు కాదు. ఇప్పటికే సోషల్ మీడియాలో బాయ్‌కాట్ పఠాన్ వైరల్ అవుతోంది. దీనికి ఎలా ఎదుర్కోవాలని పఠాన్ మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. వచ్చే సంవత్సరం జనవరి 23, 2022న పఠాన్ రిలీజ్ కానుంది. షారుఖ్ ఖాన్ పఠాన్ ప్రమోషన్స్‌ను కొంత కాలం వరకు నిలిపివేయాలన్నారట. లేదంటే ఇప్పటి నుంచే బాయ్‌కాట్ పఠాన్ పెరిగిపోతే చాలా నష్టం వస్తుందని భావించారట.
బాయ్‌కాట్ దెబ్బకు ఆమిర్ ఖాన్, అక్షయ్‌కుమార్, రణబీర్‌కపూర్, లైగర్ దారుణంగా నష్టపోయాయి. మూవీ ఇండస్ట్రీ వర్గాలుగా విడిపోయింది. బాయ్‌కాట్‌ను దాటుకొని మరీ హిట్ కొట్టాలంటే మేకర్స్‌కు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. షారుఖ్ ఖాన్.. పఠాన్‌తో పాటు జవాన్, డంకీ చిత్రాలు కూడా ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com