నా కూతురు 'మిల్లా'.. షాకిచ్చిన 'షకీలా'

నా కూతురు మిల్లా.. షాకిచ్చిన షకీలా
ఆ సమయంలో బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన మోహన్ లాల్, మమ్ముట్టి వంటి హీరోల పెద్ బడ్జెట్ చిత్రాలను కూడా పక్కకు నెట్టి తన సినిమా భారీ వసూళ్లను రాబట్టేది.

తొంభైల్లో సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన తార షకీలా. ఆమె సినిమా వస్తుందంటే మళయాళ ఇండస్ట్రీ స్టార్ హీరోల సినిమా రిలీజ్ డేట్లను కూడా మార్చుకునేది. అంత క్రేజ్ షకీలా సినిమా అంటే సినీ ప్రియులకు. ఆ సమయంలో బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన మోహన్ లాల్, మమ్ముట్టి వంటి హీరోల పెద్ బడ్జెట్ చిత్రాలను కూడా పక్కకు నెట్టి తన సినిమా భారీ వసూళ్లను రాబట్టేది. అయితే ఆర్టిక అవసరాలు, కుటుంబ పోషణ నిమిత్తం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో 'అలాంటి' పాత్రలు చేసినా ఇకపై అటువంటి చిత్రాల్లో నటించనని 2002లో ప్రకటించింది షకీలా.

చాలా గ్యాప్ తర్వాత షకీలా ఇప్పుడు తమిళ బుల్లితెరపై కుకు విత్ కోమలి షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ షో రెండో సీజన్‌లో ఆమె గట్టి పోటీ దారు. షకీలాకు టైటిల్ గెలుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలో ఓ రోజూ షకీలా బుల్లితెర ప్రేక్షకులతో పాటు, ఆమె ఫ్యాన్స్‌ని సర్‌ఫ్రైజ్ చేసింది. షో మధ్యలో ఓ అమ్మాయిని తీసుకువచ్చి నా కూతురు అంటూ పరిచయం చేసింది.

కొన్ని సంవత్సరాల క్రితం ఒక లింగమార్పిడి అమ్మాయి 'మిల్లా' ను దత్తత తీసుకున్నానని చెప్పింది. దాంతో అందరికీ ఓ సందేహం షకీలా వివాహం చేసుకోలేదు కదా సడెన్‌గా కూతురు ఎక్కడినుంచి వచ్చింది అని. మిల్లా ఓ ట్రాన్స్‌జెండర్. ఆమెని చిన్నప్పుడే దత్తత తీసుకుని పెంచి పెద్ద చేశాను.

సొంత కూతురిలా చూసుకుంటున్నాను. కష్ట సమయాల్లో నాకు అండగా నిలుస్తుంది నా కూతురు అంటూ షకీలా భావోద్వేగానికి లోనైంది. మిల్లా ఇప్పుడు బిజీ కాస్ట్యూమ్ డిజైనర్.. మోడల్‌గా ప్రయత్నిస్తోంది. అమ్మను అమితంగా ప్రేమించే ఓ మంచి అమ్మాయి అని షకీలా సంతోషంగా చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story