Shamna Kasim: ఎంత ఒత్తిడి వచ్చినా దానికి నేను 'ఎస్' చెప్పలేదు.. అందుకే..!

Shamna Kasim (tv5news.in)
Shamna Kasim: ఒకట్రెండు సినిమాలు చేసి కనుమరుగయిపోయిన నటీమణులు చాలామందే ఉన్నారు. అందులో ఒకరు పూర్ణ(Poorna). అల్లరి నరేశ్‌తో రెండు సినిమాలు చేసిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకుల మైండ్‌లో అంతలా రిజిస్టర్ అవ్వలేకపోయింది. కానీ ఒక డ్యాన్స్ షో తన కెరీర్‌కు సెకండ్ ఛాన్స్‌లాగా ఎదురయ్యింది. దానితో పూర్ణ మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది.
ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, వెబ్ సిరీస్‌లలో హీరోయిన్‌గా బిజీగా కెరీర్‌ను కొనసాగిస్తోంది పూర్ణ. అంతే కాదు పలు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేస్తూ మరోసారి తన కెరీర్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇటీవల బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అఖండ' సినిమాలో పద్మావతి పాత్రలో కనిపించడం పూర్ణకు చాలా ప్లస్ అయ్యింది.
పూర్ణ కెరీర్ ఇన్నాళ్లు చాలా స్లోగా సాగింది. ఈ విషయంపై ఆమె ఓ టాక్ షోలో స్పందించింది. సినిమా ఇండస్ట్రీ అంటే చాలా విషయాలకు ఎస్ చెప్పాల్సి వస్తుందని కానీ.. తాను చాలా విషయాలకు నో చెప్పిందని తెలిపింది. సీమటపాకాయ్ సినిమా సమయంలో తాను చాలా విషయాలకు నో చెప్పానంది పూర్ణ.
పూర్ణ.. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన అవును సినిమా గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా షూటింగ్ అంతా సాఫీగానే సాగిందని, కానీ సినిమా పూర్తయ్యి విడుదలయిన తర్వాత తాను మూవీ చూస్తూ చాలా భయపడ్డానని తెలిపింది. ఆ సినిమా ఇంపాక్ట్ వల్ల రెండు నెలలు తాను సరిగ్గా నిద్రపోలేదని, ఆ భయంతోనే ఉన్నానని చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com