Shamshera Review : షంషేరా సూపర్ హిట్.. పుష్పతో పోలుస్తున్న నెటిజన్లు..

Shamshera Review : రన్బీర్ కపూర్ హీరోగా సంజయ్ దత్ విలన్‌గా నటించిన షంషేరా సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. తొలి రోజే ఈ సినిమాకు మంచి టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే మూవీ చూసినవారు ట్విట్టర్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని పుష్ఫ, సూర్యవంశితో పోలుస్తున్నారు. బాక్సాఫిస్‌లో రికార్డులను తిరగరాస్తుందని మరికొందరు పోస్ట్ చేస్తున్నారు.
ఇక కథలోకి వెళితే.. ఓ గిరిజన జాతిని దరోగ శుద్ధ సింగ్ జైళ్లో బంధిస్తాడు. వాళ్లను విడిపంచుకోవడానికి వచ్చిన వీరుడే షంషేరా. హీరో షంషేరా పాత్రలో రన్బీర్.. విలన్ శుద్ధ్ సింగగా సంజయ్ దత అదరగొట్టారు. నువ్వా నేనా అంటూ సినిమాలో ఇద్దరిమధ్య భీకరమైన యుద్ధం నడుస్తుంది.
అయితే షంషేరాలో యాక్షన్, కామమెడీ, ఎమోషన్, రొమాన్స్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నట్లు ట్విట్టర్ రివ్యూలో పేర్కొంటున్నారు.
కరణ్ మల్హోత్రా దీనికి దర్శత్వం వహించగా మిథూన్ సంగీతాన్ని సమకూర్చారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా దీనిని నిర్మించారు. 150 కోట్లతో బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 600 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com