Ram Charan : గేమ్ ఛేంజర్ లో ట్విస్ట్.. మళ్లీ షూటింగ్ చేయాలట

Ram Charan :  గేమ్ ఛేంజర్ లో ట్విస్ట్.. మళ్లీ షూటింగ్ చేయాలట

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ మూవీ షూటింగ్ అభిమానుల సహనానికి పరీక్షలు పెడుతోంది. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా. కానీ శంకర్ భారతీయుడు 2 చేయాల్సి రావడంతో ఆగిపోయింది. అప్పుడో షెడ్యూల్ అప్పుడో షెడ్యూల్ అంటూ ఏదో ఓ చిన్న హీరో సినిమా షూటింగ్ చేసినట్టుగా చేశాడు శంకర్. విశేషం ఏంటంటే.. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా ఈ విషయంలో ఏం చేయలేకపోయాడు. కొన్నాళ్ల క్రితం సైంధవ్ ఫేమ్ శైలేష్ కొలనుతో ఓ షెడ్యూల్ చేయించాడు. మరి ఎందుకో ఆ ప్లాన్ పక్కన పెట్టారు. ఓ దశలో ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్స్ గురించి అడగటం కూడా ఆపేశారు. శంకర్ రూపొందించిన భారతీయుడు 2 రిజల్ట్ చూసిన తర్వాత అసలు ఈ మూవీ రాకపోతేనే బెటర్ అనుకుంటున్నారంటే సిట్యుయేషన్ అర్థం చేసుకోవచ్చు. అయితే ఎలాగోలా ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ పోర్షన్ అంతా పూర్తయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంటుంది అనుకున్నారు. బట్ ఇక్కడే శంకర్ మార్క్ ట్విస్ట్ ఒకటి వచ్చింది.

గేమ్ ఛేంజర్ ను డిసెంబర్ లో విడుదల చేయాలనే ఫిక్స్ అయ్యారు. అన్నీ కుదిరితే డిసెంబర్ 20న విడుదలవుతుంది. రామ్ చరణ్ పోర్షన్ అయిపోయింది కాబట్టి అదేం కష్టం కాదు. కానీ శంకర్ మళ్లీ రామ్ చరణ్ కు సంబంధించిన కొన్ని సీన్స్ ను రీ షూట్ చేయాలని చెప్పాడట. ఇందుకోసం ఓ వారం పాటు హీరో డేట్స్ కావాలని నిర్మాతకు చెప్పాడట. ఇది విని దిల్ రాజు కూడా ఆశ్చర్యపోయాడని టాక్. ఆల్రెడీ అయిపోయిందని చెప్పాక మళ్లీ డేట్స్ కావాలంటే చరణ్ ఏమంటాడో అని ఫీలవుతున్నాడట. మొత్తంగా శంకర్ ఈ సినిమాను రిలీజ్ రోజు వరకూ చెక్కుతూనే ఉంటాడా అని ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఒకవేళ రిజల్ట్ గానీ తేడా వస్తే శంకర్ కు రామ్ చరణ్ ఫ్యాన్స్ నుంచి దబిడి దిబిడి తప్పదు.

Tags

Next Story