Sharwanand : ఆర్ఎక్స్ 100 పై శర్వానంద్

ఆర్ఎక్స్ 100 .. ఈ పేరు చెబితే ఒకప్పుడు యూత్ కు బాగా ఇష్టమైన బైక్ గుర్తొచ్చేది. ఇప్పుడు అదే యూత్ కు బాగా నచ్చిన సినిమా గుర్తొస్తుంది. అలాంటి బైక్ పై స్టైల్ కూర్చుని ఫోజ్ ఇచ్చాడు హీరో శర్వానంద్. అఫ్ కోర్స్ ఇదంతా తన కొత్త సినిమాకు సంబంధించిన స్టిల్. ఇవాళ తన బర్త్ డే సందర్భంగా ఆ మూవీ నుంచి ఈ స్టిల్ రిలీజ్ చేశారు. లూజర్ అనే వెబ్ సిరీస్ తో ఫేమ్ అయ్యి సుధీర్ బాబు హీరోగా మా నాన్న సూపర్ హీరో అనే మూవీతో మెప్పించిన అభిలాష్ రెడ్డి కంకర డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ టైటిల్ ను త్వరలోనే ప్రకటించబోతున్నారు. వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. చూస్తుంటే బైక్ రేస్ లకు సంబంధించిన కథలా కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసినప్పుడు కూడా అదే ప్రతిబింబించింది. ఇక బర్త్ డే స్పెషల్ పోస్టర్ కలర్ ఫుల్ గా ఉంది. బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని బైక్ రైడర్ డ్రెస్ లో ఆర్ఎక్స్ 100 బైక్ పై స్టైలిష్ గా కూర్చుని ఉన్నాడు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు రాబోతున్నాయి. ఏదైనా ప్రస్తుతం శర్వానంద వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఈ మూవీ నుంచి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని కోరుకుందాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com