Aryan Khan: కొడుకు అరెస్టుతో.. అనారోగ్యంతో అమ్మ.. అన్నం ముట్టని నాన్న

Aryan Khan: కొడుకు అరెస్టుతో.. అనారోగ్యంతో అమ్మ.. అన్నం ముట్టని నాన్న
Aryan Khan: ఎంతైనా కొడుకు.. ఏం చేసినా క్షమించే నాన్న.. తప్పు చేస్తే మందలించాలి కానీ జైల్లో పెడతారా అని అనారోగ్యంతో మంచం పట్టిన అమ్మ.

Aryan Khan: ఎంతైనా కొడుకు.. ఏం చేసినా క్షమించే మనసున్న నాన్న.. తప్పు చేస్తే మందలించాలి కానీ జైల్లో పెడతారా అని అనారోగ్యంతో మంచం పట్టిన అమ్మ. ఎట్టకేలకు దాదాపు 25 రోజుల జైలు జీవితం గడిపిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన ఖాన్‌కి బెయిల్ మంజూరైంది.

తండ్రిగా కొడుకుని జైలు గోడల నుంచి బయటకు రప్పించేందుకు చేయని ప్రయత్నం లేదు. కలవని లాయర్లు లేరు. రోజంతా అదే పని ఎట్టకేలకు దేశంలోనే దిగ్గజ లాయర్లను పట్టుకుని కొడుకుని విడిపించేందుకు నియమించుకున్నారు. అయినా ముంబై స్పెషల్ కోర్టు మూడుసార్లు ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

దీంతో షారుఖ్ ఆందోళనకు గురయ్యారు. ఆర్యన్ అరెస్టైనప్పటి నుంచి అన్నం ముట్టలేదట షారుఖ్. తాను నియమించుకున్న లాయర్ ముకుల్ రోహత్గి బస చేసిన హోటల్‌లోనే షారుఖ్ కూడా బస చేసి మొత్తానికి కొడుక్కి బెయిల్ వచ్చేలా లాయర్‌ని సన్నద్ధం చేశారు. ఇక ఆర్యన్ తల్లి, షారుఖ్ భార్య గౌరీ ఖాన్ కొడుకు అరెస్టైనప్పటి నుంచి అనారోగ్యానికి గురయ్యారు.

పలుమార్లు బెయిల్ తిరస్కరణకు గురి కావడంతో బంధువులు, స్నేహితులతో మాట్లాడుతూ ఏడుస్తూ ఉండేదట. మొత్తానికి ఈ రోజు ఆర్యన్ జైలు నుంచి విడుదల కాబోతున్నాడనే వార్త తెలిసి షారుఖ్, గౌరీ ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కాగా, షారుఖ్ తాను పర్సనల్‌గా నియమించుకున్న లాయర్ ముకుల్ రోహత్గి తన వాగ్ధాటితో న్యాయస్థానం దద్ధరిల్లేలా చేశారు.

డ్రగ్స్‌తో ఆర్యన్‌‌కి సంబంధమే లేదని వాదించారు. ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నాడే అనుకోండి క్షమించాలి కానీ, శిక్షిస్తారా అని ప్రశ్నించి తన వాదనకి బలం చేకూర్చారు. దాంతో ముంబై కోర్టు దిగివచ్చింది. బెయిల్ మంజూరు చేసింది.

Tags

Next Story