డుంకీ మొదటి పాట లుట్ పుట్ గయా అవుట్: తాప్సీతో ప్రేమలో పడ్డ షారూఖ్

డుంకీ మొదటి పాట లుట్ పుట్ గయా అవుట్: తాప్సీతో ప్రేమలో పడ్డ షారూఖ్
షారూఖ్ ఖాన్, తాప్సీ పన్ను నటించిన డుంకీలోని మొదటి పాట లుట్ పుట్ గయా అనే పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్.

షారూఖ్ ఖాన్, తాప్సీ పన్ను నటించిన డుంకీలోని మొదటి పాట లుట్ పుట్ గయా అనే పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. డుంకీ చిత్రానికి రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోసం షారుఖ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో డుంకీ ఒకటి. షారుఖ్ ఖాన్ (SRK), నవంబర్ 21న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను పంచుకున్నారు. SRK (హార్డీ), తాప్సీ పన్ను (మను) మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉందని షారుఖ్ అభిమానులు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. హాస్యంతో నిండిన మనోహరమైన కథను రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించారు.థ్లి

డుంకీ గురించి

ఇందులో SRK మరియు తాప్సీతో పాటు బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ వంటి అసాధారణ ప్రతిభ ఉన్న నటీ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ హిరానీ, గౌరీ ఖాన్ నిర్మించారు. అభిజత్ జోషి, రాజ్‌కుమార్ హిరానీ, కనికా ధిల్లాన్‌లు ఈ చిత్రానికి రచనలు చేశారు. డుంకీ డిసెంబర్ 21, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Read MoreRead Less
Next Story