Sharukh Khan : షూటింగ్ లో ప్రమాదం.. గాయపడ్డ షారుఖ్ ఖాన్

Sharukh Khan :  షూటింగ్ లో ప్రమాదం.. గాయపడ్డ షారుఖ్ ఖాన్
X

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ షూటింగ్ లో గాయపడ్డాడు. దీంతో నెల రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ 'కింగ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.ఆ సందర్భంగా జరిగిన ప్రమాదంలో షారుఖ్ కండరాలకు గాయం అయింది. వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. వైద్యుల సూచన మేరకు అతను అమెరికాలో చికిత్స తీసుకునేందుకు వెళుతున్నాడు.గాయం మరీ పెద్దది కాకపోయినా గతంలో కూడా అనేక సార్లు యాక్షన్ సీక్వెన్స్ ల సందర్భంగా కండరాలకే గాయం అయింది షారుఖ్ కు. ప్రస్తుతం ఆయన వయసు 60 యేళ్లు. అందుకే ముందు జాగ్రత్తగా అమెరికా వరకూ వెళుతున్నాడు.

ఇక ఈ మూవీ నాన్ స్టాప్ గా చిత్రీకరించాలనుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా నెల రోజుల పాటు వాయిదా వేస్తున్నారు. కింగ్ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. దీపికా పదుకోణ్, అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ, ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Tags

Next Story