Sharwanand : మళ్లీ సంక్రాంతికే శర్వానంద్

Sharwanand :  మళ్లీ సంక్రాంతికే శర్వానంద్
X

సంక్రాంతి అనేది చాలా పెద్దదైన తెలుగు పండగ. అందుకే ఆ పండగల్లో వచ్చే మూవీస్ పై భారీ అంచనాలుంటాయి. ఈ టైమ్ కు రావాలని చాలామంది హీరోలు అనుకుంటారు. దర్శకులూ భావిస్తుంటారు. బట్ అందరికీ సాధ్యం కాదు. కొందరికి కొన్నిసార్లు మాత్రం అనుకోకుండా ఆ సినిమాలు పడుతుంటాయి. హిట్ అవుతుంటాయి. అలా ఈ సారి కూడా శర్వానంద్ కు మంచి సంక్రాంతి హిట్ పడింది. నారీ నారీ నడుమ మురారి మూవీ రూపంలో ఓ బ్లాక్ బస్టర్ మాత్రం పడిపోయింది. ఈ మూవీ అన్ని విధాలుగా మంచి ఎంటర్టైనర్ గా భావిస్తున్నారు ఆడియన్స్. ఖచ్చితంగా చెబితే ఈ యేడాది సంక్రాంతి రియల్ విన్నర్ ఈ మూవీనే అంటున్నారు. అంటే రేంజ్ లు మారుతుంటాయి కాబట్టి మెగాస్టార్ మూవీ వసూళ్లలో సత్తా చాటుతోంది. అయితే ఈ యేడాది మాత్రమే కాదు.. వచ్చే యేడాది సంక్రాంతికి కూడా వస్తున్నాడట శర్వానంద్.

తాజాగా నారీ నారీ నడుమ మురారి మూవీ సక్సెస్ మీట్ సందర్భంగా శ్రీను వైట్ల ఈ విషయాన్ని స్వయంగా చెప్పడం విశేషం. ఒక సినిమా విషయంలో ఒక యేడాది ముందే చెప్పడం ఒక్క సంక్రాంతి విషయంలోనూ జరుగుతోంది. అదే శ్రీను వైట్ల చెప్పాడు. మైత్రీ మూవీస్ బ్యానర్ లో శ్రీను వైట్ల ఓ మూవీ చేయబోతున్నాడట. అది శర్వానంద్ తోనే ఉంటుందట. ఆ సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయబోతున్నాము అని చెప్పాడు. అంటే సంక్రాంతికి విన్నర్ గ్యారెంటీ అనే ట్యాగ్ ఆల్రెడీ వచ్చింది శర్వానంద్ కి. అందుకే శ్రీను వైట్లకూ ఆ ట్యాగ్ కూ ప్లస్ అవుతుంది. మొత్తంగా ఈ మూవీ సక్సెస్ మీట్ లో మూడు విషయాలు చెప్పాడు శ్రీను వైట్ల. అతనూ ఓ సినిమాకు దర్శకత్వం చేయబోతున్నాడు. శర్వానందే హీరో. ఆ మూవీ సంక్రాంతికే విడుదల కాబోతోంది. ఇందులో ప్రస్తుతానికి ఏ మార్పూ లేదు. ఏమైనా ఉంటే అప్పుడు చూస్తారేమో అంతే తప్ప.

Tags

Next Story