Sharwanand : శర్వానంద్ విడాకులు వ్యవహారం ఏంటీ.

ఒకప్పుడు వైవిధ్యమైన కథలతో మంచి విజయాలు అందుకున్నాడు శర్వానంద్. నటుడుగానూ టాలెంటెడ్ అనిపించుకున్నాడు. బట్ ఎక్కడో ట్రాక్ తప్పాడు శర్వానంద్. వరుసగా ఫ్లాపులు పడుతున్నాయి. కథల పరంగా చేసిన ఎక్స్ పర్మెంట్స్ కూడా వర్కవుట్ కావడం లేదు. చివరగా వచ్చిన మనమే మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ అనిపించుకుంది. ప్రస్తుతం సామజవరగమనా ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ కథ ‘విడాకులు’ చుట్టూ తిరుగుతుందట. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట విడాకులు కోరుతూ కోర్ట్ కు వెళ్లడం.. అక్కడ కోర్ట్ రూమ్ లో జరిగే డ్రామా నేపథ్యంలో కథనం ఉంటుందట. వినడానికి చాలా ఆసక్తిగానే ఉంది.
అయితే కోర్ట్ రూమ్ డ్రామా అంటే చాలా సీరియస్ గా ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తాం. మరి వీళ్లూ ఆ టైప్ లోనే వెళతారా లేక రామ్ ఫస్ట్ మూవీలాగా కంప్లీట్ ఫన్ జెనరేట్ చేస్తారా అనేది చూడాలి. శర్వానంద్ సరసన ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్యనాథ్, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఈ విడాకులు అయినా శర్వానంద్ కు మంచి విజయం ఇస్తుందా లేదా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com