Sharwanand : ఆ విషయంలో డాక్టర్లు నన్ను హెచ్చరించారు : శర్వానంద్

Sharwanand : ఆ విషయంలో డాక్టర్లు నన్ను హెచ్చరించారు : శర్వానంద్
X
Sharwanand : శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' సినిమా టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసింది

Sharwanand : శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' సినిమా టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. సైంటిఫిక్ ఫిక్షన్ అయినప్పటికీ చాలా ఎమోషనల్‌గా కథ సాగుతుంది. ఇటీవళ ఇచ్చిన ఇంటర్వ్యులో ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఒకే ఒక జీవితం సినిమా మనసుకు చాలా దగ్గరైన సినిమా అని అన్నారు. పిల్లలు కూడా చాలా బాగా ఆస్వాదించారన్నారు. సినిమాకు ఎంత అర్హత ఉందే అంతే వసూలు చేస్తుంది. కథ పై తనుకు ఎక్కువ నమ్మకం ఉండేదని.. హిట్ అవుతుందని ఖచ్చితంగా ఊహించానన్నారు. అందుకే వెన్నెల కిషోర్‌కి సినిమాను మిస్ చేసుకోద్దని చెప్పినట్లు చెప్పారు.

ఒకే ఒక జీవితంలో తన పాత్రలో లీనమవుతున్నప్పుడు మనసు బరువుగా అనిపించిందని.. ఆరోగ్యాన్ని కూడా కొంత దెబ్బతీసిందని అన్నారు. ఎక్కువగా ఇలాంటి వాటికి గురికాకుండా ఉండాలని డాక్టర్లు సలహా ఇచ్చారని చెప్పారు శర్వానంద్. ఈ సినిమాను ప్రీమియర్‌ షోలో చూసిన నాగార్జున స్వయంగా కెమెరా ముందే కంటతడి పెట్టిన విషయం తెలిసిందే. శర్వానంద్ తరువాత సినిమా పూర్తి మాస్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతోంది. కృష్ణ చైతన్య దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

Tags

Next Story