Sharwanand : శర్వానంద్ తో భోగి.. ప్యాన్ ఇండియానా.. ? అదేం చిత్రం.

శర్వానంద్ ఈ మధ్య సరైన సినిమాలు లేక ఇబ్బంది పడుతున్నాడు. ఆ లోటును తీర్చేలా రీసెంట్ గా వచ్చిన సంక్రాంతి మూవీ నారీ నారీ నడుమ మురారి విజయం సాధించింది. కాకపోతే ఈ సక్సెస్ లో చాలా సినిమాల షేరింగ్ ఉంది. ఆ కారణంగా కంటెంట్ బావుంది అనే టాక్ వచ్చినా కలెక్షన్స్ ఆ స్థాయిలో రాలేదు. తర్వాత బైకర్ అనే మూవీతో సిద్ధం అవుతున్నాడు. ఆపై సంపత్ నంది డైరెక్షన్ లో ‘భోగి’అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అంత వరకు బానే ఉంది. కానీ ఇది ప్యాన్ ఇండియా మూవీ అంటూ చెప్పడమే అతిశయోక్తిలాగా ఉంది. ఈ మధ్య కాలంలో ప్యాన్ ఇండియా పిచ్చి తెలుగు వాళ్లకు బాగా పెరిగింది. ఆ పేరుతో లుక్ లో కాస్త ఊరమాస్ గెటప్ లు కనిపించడం అదేదో కొత్తదనం అన్నట్టుగా చూపించడం మాత్రం విపరీతంగా కనిపిస్తోంది.
ఇప్పటి వరకు శర్వానంద్ కు టైర్ 2 హీరోగానే సరైన పేరు లేదు. అలాంటోడు ఏకంగా ప్యాన్ ఇండియా మూవీ అనడం మాత్రం అతిగా ఉంది. అలాగే దర్శకుడు సంపత్ నందికి సైతం ఇన్నేళ్లుగా సరైన బ్లాక్ బస్టర్ లేదు. అతనూ ప్యాన్ ఇండియా అనడం.. విడ్డూరంగా ఉంది. ఒకవేళ ఈ కథలో దమ్మున్నా.. వీళ్లను ప్యాన్ ఇండియా ఆడియన్స్ పట్టించుకునే అవకాశం ఉందా..? అంటే లేదు అనే చెప్పాలి. అసలు వీళ్లు ముంబైలోనో, లేక చెన్నై, బెంగళూరులోనూ ప్రమోషన్స్ చేసినా.. ఆ ప్రమోషన్స్ కు వచ్చేన్ని పైసలు కూడా థియేట్రికల్ గా వసూళ్లు రావడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. ఎందుకంటే ప్యాన్ ఇండియా ఆడియన్స్ కూడా చాలా క్లియర్ గా ఉన్నారు. కంటెంట్ ను బట్టి కాకుండా ముందుగా స్టార్డమ్ వైపు చూస్తున్నారు. అంటే గతంలో కేజీఎఫ్ కూడా ఇలాంటి ప్యాన్ ఇండియా మూవీనే కదా అనుకోవచ్చు. బట్ అది వేరు. ఇప్పుడు కాలం మారింది. మారిన కాలాన్ని బట్టి.. ఇలా ప్యాన్ ఇండియా మూవీస్ అంటూ చాలా సినిమాలతో చాలామంది మీద రుద్దుతున్నారు. ఆ రుద్దడం చూసి ఆ ఆడియన్స్ తలబొప్పి కట్టింది. అందుకే వీళ్లు ఏ మాత్రం పెద్దగా తెలియని హీరోలు, దర్శకులను లైట్ తీసుకుంటున్నారు. మరి చూద్దాం.. శర్వానంద్ కూడా ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను భోగితో మెప్పిస్తాడా లేక చప్పగానే ఉండిపోతాడా అనేది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
