Manamey OTT Release : ఆగస్టు 16వ తేదీ నుంచి ఓటిటీలో మనమే

Manamey OTT Release : ఆగస్టు 16వ తేదీ నుంచి ఓటిటీలో మనమే
X

చార్మింగ్ స్టార్ శర్వానంద్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం మనమే. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు.ఈ మూవీ జూన్ 7వ తేదీన ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది. దీనికి ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ సొంతం అయింది. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీకి స్పందన కూడా బాగానే వచ్చింది. ఫలితంగా భారీగా కాకుండా యావరేజ్ కలెక్షన్లను అందుకుంది. దీంతో ఈ మూవీ సెమీ హిట్ గానే మిగిలిపోయింది. యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన 'మనమే' మూవీపై హైప్ ఉండడంతో.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు పోటీ కూడా భారీగానే ఏర్పడింది. ఈ సినిమా ఓటీటీ రైట్ ను ‘అమెజాన్ ప్రైమ్'దక్కించుకుంది. మూవీ విడుదలై రెండు నెలలు దాటినా స్ట్రీమింగ్ చేయడం లేదు.

దీనిపై లేటెస్ట్ గా ఓ అప్డేట్ వచ్చింది. ఆగస్టు 16వ తేదీ నుంచి ఇది ఓటీటీలో మనమే స్ట్రీమింగ్ కానుందట. ఈ రెండు రోజుల్లోనే అమెజాన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Tags

Next Story