Sharwanand: పవన్‌నే బీట్ చేసిన శర్వానంద్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం భీమ్లానాయక్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. విడుదలైన అన్ని థియేటర్లలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసి పవన్ కళ్యాణ్‌కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే ఈ వారం రిలీజైన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు.
ఈ చిత్రంలో శర్వానంద్, రష్మిక జంటగా నటించగా గురువారం USA ప్రీమియర్ షోల కలెక్షన్ $55,774 వసూలు చేసింది. కానీ భీమ్లా నాయక్ గురువారం $10,336 మాత్రమే రాబట్టింది. ఈ విధంగా USA బాక్సాఫీస్ వద్ద భీమ్లా నాయక్ చిత్రాన్ని ఆడవాళ్లు మీకు జోహార్లు కొలగొట్టారు.
"ఆడవాళ్లు మీకు జోహార్లు గురువారం ప్రీమియర్‌ల కోసం 209 లొకేషన్‌ల నుండి $55,774 వసూలు చేసింది. "భీమ్లా నాయక్ గురువారం USAలోని 136 ప్రదేశాల నుండి $10,336 వసూలు చేసింది. భీమ్లా నాయక్, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు, ఇందులో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటించారు. ఫిబ్రవరి 25న విడుదలైంది.
ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా శర్వానంద్, రష్మిక జంటగా నటించారు. ఇతర ప్రధాన తారాగణం రాధిక, ఖుష్బూ, ఊర్వశి నటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com