Shehnaaz Gill: బిగ్ బాస్ కంటెస్టెంట్ తండ్రిపై దుండగుల కాల్పులు..

Shehnaaz Gill (tv5news.in)
Shehnaaz Gill: బిగ్ బాస్ రియాలిటీ షో ముందుగా హిందీలో మొదలయ్యింది. అక్కడ సూపర్ హిట్ అయిన తర్వాతే దానిని సౌత్ భాషల్లోకి తీసుకొచ్చారు. అందుకే బిగ్ బాస్ హిందీ సీజన్ ఏకంగా 13 సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే ముందు సీజన్ల కంటే బిగ్ బాస్ 13వ సీజన్ కాస్త హైలెట్ అయ్యింది. అందులో కంటెస్టెంట్‌గా చేసిన సిద్ధార్థ్ మరణం వల్ల ఇప్పటికే బిగ్ బాస్ 13వ సీజన్ వార్తల్లోకెక్కింది. తాజాగా అందులోని మరో కంటెస్టెంట్ తండ్రిపై జరిగిన దాడి కలకలం రేపింది.
షెహనాజ్ గిల్, సిద్ధార్థ్.. బిగ్ బాస్ సీజన్ 13లో చాలా క్లోజ్‌గా ఉండేవారు. ఇక వీరిద్దరిని రియల్ లైఫ్ కపుల్ అని కూడా ఊహించేసుకున్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు. సిద్ధార్థ్ మరణం తర్వాత కూడా షెహనాజ్ పేరు సోషల్ మీడియాలో బాగానే వినిపించింది. అయితే తాజాగా హెహనాజ్ తండ్రి సంతోఖ్ సింగ్ సుఖ్‌పై జరిగిన దాడి ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
సంతోఖ్ సింగ్ కారులో ఉండగా ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి కాల్పులకు ఎగబడ్డారు. ఈ దాడితో సంతోఖ్ సింగ్ ఏ గాయం లేకుండా బయటపడ్డారు. ఆయన సెక్యూరిటీ.. ఆ దుండగులను పట్టుకునే ప్రయత్నం చేయగా వారు తప్పించుకున్నారు. ఈ విషయంపై సంతోఖ్ సింగ్ జంధ్యాల గురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. వారు ఆయన ఇంటి వారు నాలుగు బులెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com