Sekhar Kammula : సాయి పల్లవిపై శేఖర్ కమ్ముల పర్సనల్ ఇంట్రెస్ట్

Sekhar Kammula :   సాయి పల్లవిపై శేఖర్ కమ్ముల పర్సనల్ ఇంట్రెస్ట్

టాలీవుడ్ లో మోస్ట్ సెన్సిబుల్ మూవీ మేకర్ అంటే శేఖర్ కమ్ముల అనే చెప్పాలి. కాకపోతే అతను కూడా రూట్ మారుస్తున్నాడు. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న కాంబోలో ప్రస్తుతం కుబేర అనే మూవీ చేస్తున్నాడు. ఇది యాక్షన్ మూవీ కాదు కానీ ఫస్ట్ టైమ్ స్టార్స్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. అయినా తనదైన శైలిలోనే కథ చెప్పబోతున్నాడని ఈ మూవీ నుంచి రిలీజ్ అవుతోన్న కంటెంట్ చూస్తే అర్థం అవుతోంది. ముగ్గురు టాప్ స్టార్స్ తో తను అనుకున్న కథ చెప్పడం అంటే ఆ స్టోరీ స్పాన్ నెక్ట్స్ లెవల్ లో ఉందని అర్థం. అయితే కుబేర తర్వాత ఏంటీ అనే ప్రశ్నకు ఆల్రెడీ సమాధానం ఉంది శేఖర్ కమ్ముల దగ్గర.

మామూలుగా ఒక ప్రాజెక్ట్ సెట్స్ లో ఉంటే మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించడు శేఖర్. ఆ ట్రెండ్ కు కూడా మంగళం పాడాడు. ఆల్రెడీ మూడు నాలుగు కథలు రెడీగా పెట్టుకున్నాడు.

కుబేర తర్వాత మళ్లీ ధనుష్ తోనే ఓ ప్రాజెక్ట్ చేస్తాడు అనే టాక్ ఉంది. అయితే ధనుష్ తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఒకవేళ టైమ్ కుదరకపోతే .. నాని హీరోగా సినిమా చేయాలనుకుంటున్నాడట. విశేషం ఏంటంటే.. ఈ కథలో హీరో ఎవరైనా హీరోయిన్ మాత్రం సాయిపల్లవి అనే ఫిక్స్ అయ్యాడట. అంటే ధనుష్ తో చేసినా.. నానితో చేసినా కథ మారినా హీరోయిన్ మాత్రం సాయి పల్లవి ఉండాల్సిందే అనేది శేఖర్ స్ట్రాంగ్ ఫీలింగ్ ట. సాయి పల్లవిని తెలుగు తెరకు ఫిదాతో అతనే పరిచయం చేశాడు. తన నటన ముందు వరుణ్ తేజ్ తేలిపోయాడనే చెప్పాలి. తర్వాత లవ్ స్టోరీ మూవీలో మళ్లీ హీరోను డామినేట్ చేసే రోల్ ఇచ్చాడు. మరోసారి సాయి పల్లవి అంటే హీరోలు కూడా కాస్త ఆలోచిస్తారనే చెప్పాలి. మరి సాయి పల్లవి అంటే శేఖర్ కమ్ములకు ఎందుకంత పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే.. సింపుల్. ఏ దర్శకుడైనా తన ఆలోచనకు తగ్గట్టుగా నటించే ఆర్టిస్టులంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అదే ఇక్కడా కనిపిస్తుంది.

Tags

Next Story