Shekhar Master : ఈ సంక్రాంతి కి శేఖర్ మాస్టర్ హవా

ఇండస్ట్రీ మోస్ట్ టాలెంటెడ్ కోరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నాడు శేఖర్ మాస్టర్. ప్రతిసారీ తనదైన స్టెప్పులతో అదరగొడుతుంటాడు. ఈ సారి సంక్రాంతికి కూడా అదే చేశాడు. తన పాటలతో ఈ సంక్రాతి సినిమా లలో జోష్ నింపారు. ఇండస్ట్రీ లో టాప్ కోరియోగ్రాఫర్ గా లీడ్ చేస్తున్న శేఖర్ మాస్టర్ కి సౌత్ ఇండస్ట్రీ లో మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. విజయ్ దళపతి జన నాయగన్ లో మాస్టర్ కంపోజ్ చేసిన పాటలు విజయ్ ఫాన్స్ కి మోస్ట్ మెమరబుల్ కానున్నాయి. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' లో వామ్మో వాయ్యో పాట సినిమా విజయం లో కీలక పాత్ర పోషించింది. ఆషిక రంగనాథ్ ఈ పాట లో ఫస్ట్ టైం మాస్ స్టెప్స్ లో అలరించారు. ఈ సినిమా లో "హెల్లా బెల్లా" సాంగ్ కూడా పాపులర్ అయ్యింది.
సంక్రాతి కి అనగనగ ఒక రాజు లో " భీమవరం వరం బాలమా " సాంగ్ తో నవీన్ పోలిశెట్టికి కొత్త క్రేజ్ ని తెచ్చింది. తను చేసిన మొదటి సెట్ సాంగ్ మాస్టర్ చేయడం. ఆ పాట సినిమా విజయం లో మంచి రోల్ ప్లే చేసింది. నవీన్ డాన్స్ చేసిన మొదటి సాంగ్ కూడా ఇదే. ఈ పాట లోని హుక్ స్టెప్ ప్రొమోషన్స్ లో పార్ట్ గా మారింది. నారి నారి నడుమ మురారి లో టైటిల్ సాంగ్ కి కూడా మంచి ప్రశంసలు దక్కాయి.సౌత్ లో లీడింగ్ కోరియోగ్రాఫర్ గా ఉన్న శేఖర్ మాస్టర్ ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
