Shilpa Shetty : స్టారెంట్ మూసేస్తున్నాం.. శిల్పాశెట్టి కీలక ప్రకటన

Shilpa Shetty : స్టారెంట్ మూసేస్తున్నాం.. శిల్పాశెట్టి కీలక ప్రకటన
X

నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌ కుంద్రా దంపతులు గత కొన్ని రోజులుగా వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ముంబైలోని బాంద్రాలో ఉన్న వారి ప్రముఖ రెస్టారెంట్ 'బాస్టియన్' ను మూసివేయనున్నట్లు శిల్పాశెట్టి ప్రకటించారు. ఈ విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. శిల్పాశెట్టి తన పోస్ట్‌లో "ముంబైలో ఎంతో పేరు పొందిన మా 'బాస్టియన్' రెస్టారెంట్‌ను గురువారం మూసివేయనున్నాం. 'బాస్టియన్' లెక్కలేనన్ని జ్ఞాపకాలను, మర్చిపోలేని క్షణాలను, ఎన్నో ఆనందాలను ఇచ్చింది. చివరిసారిగా గురువారం మా వ్యాపార భాగస్వాములు, సన్నిహితులతో ఒక వేడుక నిర్వహిస్తున్నాం. త్వరలోనే కొత్త అనుభవాలతో మీ ముందుకు వస్తాం" అని పేర్కొన్నారు.

సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే శిల్పాశెట్టి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి, 'బాస్టియన్' పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ముంబైలో దీనికి ఆరు బ్రాంచ్‌లు ఉన్నాయి. అయితే రెస్టారెంట్ మూసివేతకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.

రూ.60 కోట్ల మోసం కేసు:

ఇటీవల శిల్పాశెట్టి, రాజ్‌ కుంద్రా దంపతులపై రూ.60 కోట్ల మోసం కేసు నమోదైంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఫిర్యాదు మేరకు పెట్టుబడి ఒప్పందం పేరుతో తమను మోసం చేశారని ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఒకవైపు ఈ కేసు విచారణ జరుగుతుండగా మరోవైపు రెస్టారెంట్ మూసివేత నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

Tags

Next Story