నేను తప్పు చేశాను.. పొరపాటు జరిగింది: శిల్పాశెట్టి

పోర్న్ కేసులో తన భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయినప్పటి నుండి, శిల్పా శెట్టి తన వ్యక్తిగత గొడవలతో ముడిపడి ఉండే పోస్ట్‌లను సోషల్ మీడియాలో పదేపదే పంచుకుంటున్నారు. ఈసారి ఆమె 'మిస్టేక్స్' అనే పుస్తకం నుండి కొన్ని లైన్లను తీసుకున్నారు. తప్పులు చేయడం, దాని నుండి నేర్చుకోవడం సరైందేనని ఆమె పేర్కొన్నారు.
"ఎవరూ ఎక్కడా తప్పులు చేయకుండా వారి జీవితాలను ఆసక్తికరంగా మలచుకోలేరు. అవి ప్రమాదకరమైన తప్పులు కాకుండా ఉండాలి. ఇంకా ఇతర వ్యక్తులను బాధించే తప్పులు కాకూడదని నేను ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పులు ఉంటాయి. మన తప్పులను మనం మర్చిపోయి సామాన్య జీవితం గడపాలనుకోవడం పెద్ద సవాలుతో కూడుకున్నది.
తప్పులు జీవతం మనకు నేర్పిన అనుభవ పాఠాలు. చేసిన తప్పుల వల్ల కాదు, వాటి నుండి మనం ఏం నేర్చుకున్నామనేది చాలా ముఖ్యం. 'పొరపాటు జరిగింది.. కానీ సరే'' జీవితం ముందుకు నడిపించాలి అని శిల్పాశెట్టి తాను చదివిన పుస్తకంలోని వాఖ్యలను తనకి అన్వయించుకుంటూ రాసినట్లు అర్థం చేసుకుంటున్నారు నెటిజన్స్.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com