Thandel : తండేల్ నుండి శివపార్వతులు

Thandel : తండేల్ నుండి శివపార్వతులు

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వాస్తవిక సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో శివరాత్రి బ్యాక్డ్రాప్ లో ఒక సాంగ్ ఉండనుందట. ఆ పాట సినిమాకు హైలెట్ గా నిలువనుందట. తాజాగా ఆ పాట నుండి ఓ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. నాగ చైతన్య, సాయి పల్లవి శివపార్వతులుగా ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న తండేల్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Tags

Next Story