SHIVAJI: శివాజీ వ్యాఖ్యలపై భగ్గుమంటున్న నటీమణులు

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ నిన్న రాత్రి ఒక సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి. సదరు ఈవెంట్లో మాట్లాడిన శివాజీ, మహిళలు పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలని, శారీలోనే అందం ఉంటుందని అన్నారు. హీరోయిన్లు తాము ఇష్టమొచ్చినట్టు దుస్తులు వేసుకుంటే అపఖ్యాతి పాలవుతారని, మిస్ యూనివర్స్ టైటిల్స్ శారీ ధరించిన వారే గెలుచుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంలో అనుచిత కామెంట్లు సైతం చేశారు శివాజీ. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, చాలా మంది నెటిజన్లు శివాజీని తీవ్రంగా విమర్శించారు. ఇటీవల కొంత మంది సెలబ్రీటీలు, దర్శకులు, మూవీ టీం సభ్యులు కొన్నిసార్లు ఈవెంట్స్ వేళ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మరీ వాళ్ల మూవీకి ప్రమోషన్ కోసం చేస్తున్నారో లేదా ఏదో ఫ్లోలో మాట్లాడేస్తున్నారో తెలీదు కానీ మహిళలను అగౌరవపర్చే విధంగా కొంత మంది మాట్లాడుతున్నారు. దీంతో వారి ఈవెంట్ లలో ఏదో ఒక రచ్చ జరిగి వారి మూవీ కాస్త రచ్చగా మారుతుంది. ఈ క్రమంలో తాజాగా... నటుడు శివాజీ హీరోయిన్ల చేసిన కామెంట్స్ నెట్టింట దుమారంగా మారాయి. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారాయి. శివాజీ మాట్లాడుతూ... యాంకర్ డ్రెస్సింగ్ సెన్స్‌ను ప్రశంసించారు. అదే విధంగా హీరోయిన్ల వేష ధారణపై మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి. హీరోయిన్ల అందం చీరలో, నిండుగా కప్పుకున్న బట్టల్లో ఉంటుందన్నారు. సామాన్లు కన్పించేలా బట్టలు ధరిస్తేచాలా మంది లోపల బూతులు తిట్టుకుంటారని అన్నారు.
అదే విధంగా.. స్త్రీ స్వేచ్ఛను ప్రస్తావిస్తూ, స్వేచ్ఛ అనేది అదృష్టమని, దాన్ని మనంచేసే పనులతో కోల్పోకూడదంటూ మాట్లాడారు. సావిత్రి, సౌందర్యలు వారి వస్త్ర ధారణతో చిరస్థాయిగా గుర్తుండిపోయారన్నారు. ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. దీనిపై పలువురు హీరోయిన్లు శివాజీ వ్యాఖ్యల్ని ఏకీపారేస్తున్నారు. తాజాగా.. సింగర్ చిన్మయి దీనిపై పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. మహిళలు ట్రెడిషనల్ గా చీరలు ధరించాలా.. ?.. అయితే.. మీరు జీన్స్ లు, హుడీలు మానేసి బొట్టుపెట్టుకుని, ధోతిలు కట్టుకొవాలని కౌంటర్ లు వేశారు. అదే విధంగా పెళ్లయితే కంకణం, మెట్టెలు ధరించాలని కూడా సెటైరిక్ గా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. ఒక సినిమాలో విలన్ గా చేసి మొత్తంగా పొకిరీలకు హీరో అయ్యాడంటూ కూడా చిన్మయి శివాజీనీ ఏకీపారేశారు. మహిళల డ్రెస్సింగ్‌ను టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

