Shivam Bhaje : ఓవర్సీస్ లో గ్రాండ్ రిలీజ్ కాబోతోన్న 'శివం భజే'

అశ్విన్ బాబు, దిగాంగన సూర్యవంశీ జంటగా నటించిన సినిమా ‘శివం భజే’. ఈ మూవీ ఆగస్ట్ 1న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పాటలకి, ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన లభించడం ఇంటర్నేషనల్ క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట లాంటి అనేక అంశాలతో న్యూ ఏజ్ కథ కథనాలు ఉండనున్నట్టు నిర్మాత మహేశ్వర రెడ్డి మూలి చెప్పడంతో మార్కెట్ లో మంచి బజ్ వచ్చింది. సినిమాపైనా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో శివం భజే చిత్రానికి ఓవర్శీస్ లో కూడా మంచి డిమాండ్ వచ్చింది. ఓవర్శీస్ లో ఈ మూవీని వర్ణిక విజువల్స్ సంస్థ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతోంది.
అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితర తారాగణంతో పాటు ఇండస్ట్రీలో మేటి సాంకేతిక నిపుణులు కూడా ఉండడంతో చిత్ర విజయం పై విశ్వాసంతో ఓవర్సీస్ లో చేయడానికి వర్ణిక విజువల్స్ ముందుకు వచ్చారు.
అంచనాలను దృష్టిలో ఉంచుకుని తాజాగా ఓవర్సీస్ లో ఒక రోజు ముందే, అంటే జూలై 31న ప్రీమియర్స్ వేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com