Shivani Rajashekar: తెలుగమ్మాయి అయ్యుండి ఏంటిది? నెగిటివ్ కామెంట్స్‌పై స్పందించిన శివాని రాజశేఖర్..

Shivani Rajashekar: సీనియర్ హీరో రాజశేఖర్, జీవితల వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శివాని రాజశేఖర్. హీరోయిన్‌గా తను చేసింది తక్కువ సినిమాలే అయినా.. స్టోరీ సెలక్షన్ విషయంలో, యాక్టింగ్ విషయంలో శివానికి మంచి మార్కులే పడ్డాయి. ఇటీవల శివాని రాజశేఖర్ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పోటీలో శివాని చేసిన పనికి తనపై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సాధారణంగా ఎవరైనా ముందు మోడలింగ్ చేసి.. ఆ తర్వాత హీరోయిన్లుగా మారుతారు. కానీ శివాని కాస్త డిఫరెంట్‌గా ట్రై చేసింది. ముందు హీరోయిన్‌గా పరిచయమయ్యి ఒకట్రెండు సినిమాలు చేసిన తర్వాత మోడల్‌గా మారి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంటోంది. అయితే ఈ పోటీల్లో శివాని తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా తమిళనాడు నుండి పోటీ చేయడం వల్ల తనపై విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిపై శివాని తాజాగా స్పందించింది.
తన తండ్రి రాజశేఖర్ నటించిన 'శేఖర్' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న శివాని రాజశేఖర్.. తాను మిస్ తమిళనాడుగా పోటీ చేయడానికి గల కారణాన్ని బయటపెట్టింది. మిస్ ఇండియా నిర్వహకులు తనను రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోమని చెప్పినప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడును కూడా సెలక్ట్ చేశానని చెప్పింది శివాని.
తాను పుట్టింది, పెరిగింది అంతా చెన్నైలోనే కాబట్టి తాను మిస్ ఇండియా పోటీల్లో తమిళనాడును కూడా ఓ ఆప్షన్‌లాగా పెట్టినట్టు తెలిపింది శివాని. కానీ తానొక తెలుగమ్మాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల నుండే సెలక్ట్ అయ్యింటే బాగుండేదని తన కోరికను బయటపెట్టింది. ఇక ఓవైపు మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంటూనే మరోవైపు తన తండ్రితో కలిసి 'శేఖర్' సినిమా చేస్తోంది శివాని.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com