GOAT movie collections : డిజాస్టర్ టాక్.. అయినా సూపర్బ్ కలెక్షన్స్

GOAT movie collections :  డిజాస్టర్ టాక్.. అయినా సూపర్బ్ కలెక్షన్స్
X

స్టార్ హీరోల మూవీకి అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయి. సరిగా ప్రమోషన్స్ చేయకపోయిన ఎర్లీ మార్నింగ్ షో నుంచే డిజాస్టర్ టాక్ వచ్చినా.. తమిళ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన గోట్ మూవీకి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు ఈ చిత్రానికి సౌత్ లాంగ్వేజెస్ తో పాటు ఓవర్శీస్ నుంచే 126 కోట్లు వసూళ్లు రావడం విశేషం. డిజాస్టర్ టాక్ బలంగా పడటం ఫ్యాన్స్ కు కూడా ఈ మూవీ నచ్చకపోవడం అనే ప్రభావం రెండో రోజు కనిపించింది. అయినా కలెక్షన్స్ పూర్తిగా పడిపోలేదు. రెండో రోజు కూడా ఈ మూవీ ఏకంగా 74 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన రెండు రోజుల్లోనే 200 కోట్ల మార్క్ ను దాటింది. మామూలుగా విజయ్ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు సాధిస్తుంటాయి. స్టార్ హీరోలతో నిర్మాతలు కాస్త రిస్క్ చేసైనా మూవీస్ చేసేది ఈ కారణంగానే. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ డజన్ ఫ్లాపులు చూసినా నిర్మాతలు నిండా మునిగారు అనే టాక్ పెద్దగా వినిపించేది కాదు. ఎందుకంటే వీకెండ్ కే మాగ్జిమం వసూళ్లు వచ్చేవి. ఆ కారణంగానే ఆయన అన్ని ఫ్లాపులు ఉన్నా.. గబ్బర్ సింగ్ తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

గోట్ మూవీ టైటిల్ కు తగ్గ రిజల్ట్ ను తెచ్చుకుని ఉంటే ఖచ్చితంగా చాలా రికార్డులు క్రియేట్ చేసి ఉండేదే అనేది వాస్తవం. అందుకు ఈ కలెక్షన్లే నిదర్శనం. బట్ దర్శకుడు వెంకట్ ప్రభు నిర్లక్ష్యం.. కొడుకు క్యారెక్టర్ కనెక్ట్ కాకపోవడం.. ఎక్కడా ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే సన్నివేశాలు లేకపోవడం.. పాటలూ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైనస్ కావడం.. హీరో ముందే చాలామంది చనిపోతుండటం.. ఇవన్నీ కూడా సినిమాకు డిజాస్టర్ టాక్ ను తెచ్చాయి. అయితే తమిళ్ లో నష్టాలు రాకపోవచ్చేమో కానీ.. ఇతర భాషల్లో మాత్రం కొన్నవాళ్లకు లాస్ లు తప్పవు.

Tags

Next Story