Mohanlal : మూడు గంటల సినిమాలో హీరో కనిపించేది 40 నిమిషాలేనట

Mohanlal  :  మూడు గంటల సినిమాలో హీరో కనిపించేది 40 నిమిషాలేనట
X

ఏ కమర్షియల్ సినిమాలో అయినా హీరో సినిమా అంతా ఉంటేనే కిక్. లేదంటే ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా డిజప్పాయింట్ అవుతారు. ఏదైనా ఎక్స్ ట్రార్డినరీ స్క్రీన్ ప్లే ఉంటేనే తప్ప హీరోలు అంత సేపు లేకపోయినా యాక్సెప్ట్ చేస్తారు. బట్ ట్రైలర్ తోనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్న సినిమా అనిపించుకున్న ‘ఎల్ 2 ఎంపూరన్’ విషయంలో ఇది ఖచ్చితంగా డిజప్పాయింటింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో మోహన్ లాల్ కేవలం 41 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు అని దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారనే చెబుతున్నాడు. సినిమా నిడివి 2 గంటల 57 నిమిషాలట. దాదాపు మూడు గంటలు. అంత పెద్ద సినిమాలో హీరో కనిపించేది కేవలం 41 నిమిషాలే అనేది డైజెస్ట్ చేసుకోలేని అంశం. కానీ పృథ్వీరాజ్ కూడా అదే చెబుతున్నాడు. ఈ సినిమాలో ఉన్న మ్యాజికల్ స్క్రీన్ ప్లే ప్రకారం చూస్తే ఆయన అంత తక్కువ సమయమే కనిపించాడు అనే ఫీల్ ఆడియన్స్ లో రాదు అని కాన్ఫిడెంట్ గా అంటున్నాడు. అటు మోహన్ లాల్ సైతం ఈ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ వల్ల ఆ ఫీలింగ్ రాదని చెప్పడమే కాదు.. తను నటించిన చాలా మళయాల సినిమాల్లో ఇంటర్వెల్ టైమ్ లో తన ఎంట్రీ ఉంటుందని ఉదాహరణలు చెప్పాడు.

ఇక ఈ నెల 27న విడుదల కాబోతోన్న ఎంపూరన్ కు అనూహ్యంగా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. అది కూడా ట్రైలర్ తర్వాత కావడం విశేషం. అన్ని భాషల్లో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. తెలుగులో కూడా సినిమాపై మంచి బజ్ ఉంది. పృథ్వీ ప్రభాస్ తో సలార్ లో నటించి ఉండటం.. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తుండటం ఆ హీరోల అభిమాలను ఈ సినిమా చూసేలా చేస్తుందని చెప్పొచ్చు. ఇక మోహన్ లాల్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చేశాడు. అది కాక ఆయన ఎప్పటి నుంచో తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ యాక్టర్. సో.. ఇవన్నీ వర్కవుట్ అయితే ఎంపూరన్ తెలుగులో కూడా పెద్ద విజయం సాధించే అవకాశాలు లేకపోలేదు.

Tags

Next Story