Kiran Abbavaram : బుల్లితెరపై బోల్తా పడ్డ ‘క’

Kiran Abbavaram :  బుల్లితెరపై బోల్తా పడ్డ ‘క’
X

వెండితెరపై బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు బుల్లితెరపై తేలిపోవడం, ఓటిటిల్లో ఆకట్టుకోకపోవడం చూస్తూనే ఉన్నాం. అలాగే సిల్బర్ స్క్రీన్ పై ఫ్లాప్ అయిన మూవీస్ కు డిజిటిల్ అండ్ శాటిలైట్ లో మంచి అప్లాజ్ వస్తుంటుంది. ఇదో సెంటిమెంట్ లా కూడా మారింది. అయితే ఈ మధ్య కొన్ని సినిమాలు రెండు చోట్లా ఆకట్టుకుంటూ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేశాయి. లాస్ట్ ఇయర్ వచ్చిన కిరణ్ అబ్బవరం ‘క’ విషయంలో ఆ సెంటిమెంట్ రిపీట్ అయింది. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయిందీ సినిమా. ఏకంగా 50 కోట్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ ను కూడా ఆశ్చర్యపరిచింది. కిరణ్ అబ్బవరం కెరీర్ కు కొత్త ఊపు తెచ్చిందీ విజయం. 2024లో హయ్యొస్ట్ గ్రాస్ వసూలు చేసిన టాప్ టెన్ తెలుగు మూవీస్ లోనూ చోటు సంపాదించుకుందీ చిత్రం. అలాంటి మూవీకి బుల్లితెరపై చుక్కెదురు కావడం విశేషం.

క మూవీకి బుల్లితెరపై వచ్చిన రేటింగ్ చూసి చాలామంది దీన్ని ఓవర్ రేటెడ్ మూవీ అంటున్నారు. సందీప్, సుజిత్ ద్వయం డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కిరణ్ తో పాటు నయన్ సారిక, తన్వీ రామ్, అచ్యుత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. శ్యామ్ సిఎస్ అందించిన నేపథ్య సంగీతం హైలెట్ గా నిలిచింది. ఇక థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ కాబట్టి బుల్లితెరపైనా ఆకట్టుకుంటుంది అనుకున్నారు. బట్ క చిత్రానికి బుల్లితెరపై వచ్చిన రేటింగ్ 2.15 మాత్రమే ఆశ్చర్యం. ఇందుకు కారణాలేంటీ అనేది అందరికీ తెలిసిందే. కిరణ్ కు ఇప్పటి వరకూ పెద్దగా క్రేజ్ లేదు. ఈ చిత్రంతోనే క్రేజ్ క్రియేట్ అయింది. అది బుల్లితెర ప్రేక్షకుల వరకూ ఇంకా చేరలేదు అనుకోవచ్చు. లేదా నిజంగానే ఇది ఆ ప్రేక్షకులకు నచ్చలేదు అనుకోవచ్చు. అదీ కాదంటే ఆల్రెడీ థియేటర్స్ లో చూసిన సినిమానే కదా అని లైట్ తీసుకుని ఉండొచ్చు.

రేటింగ్ అచ్చంగా చూస్తే అర్బన్ ఏరియాస్ లో 2.15 గా ఉంటే అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ కలిపి 2.11 గా మాత్రమే ఉంది. దీన్ని థియేటర్ లెక్కల్లో చూస్తే బుల్లితెరపై క డిజాస్టర్ అయిందని చెబుతారు.

Tags

Next Story