Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ కు ప్రీమియర్స్ ఉండవా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా జోష్ గా నటించిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ - పవన్ కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్ లో కూడా ఓ రకమైన ఎగ్జైట్మెంట్ ఉంది. గబ్బర్ సింగ్ లాంటి యాటిట్యూడ్ తోనే కనిపిస్తున్నాడు పవన్ కూడా. చాలా పవర్ ఫుల్ గా నటించాడని అర్థమైతుంది. శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించిన మూవీ ఇది. తమిళ్ నటుడు పార్తీబన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీని ఈ నెల 19న విడుదల చేయబోతున్నారు. రేపు ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాతి రోజు అంటే 15న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్స్ విషయంలోనే ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో. ఈ మూవీకి ప్రీమియర్స్ కు పర్మిషన్ లేదు అని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఇష్యూస్ వల్ల తెలంగాణ హై కోర్ట్ ఒక మాట చెప్పింది. ఏ మూవీ అయినా ప్రీమియర్స్ కావాలంటే.. ఆ సినిమా విడుదలకు 90 రోజుల ముందే అందుకోసం ఒక దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తు పరిశీలనలోకి తీసుకున్న కోర్ట్ తర్వాత పర్మిషన్ ఇస్తుంది. కొన్నిసార్లు ఆ అనుమతి కూడా ఇవ్వడం కుదరదు అని కోర్ట్ చెప్పింది. ఆ కారణంగా ఉస్తాద్ భగత్ సింగ్ కు కూడా ప్రీమియర్స్ కు సాధ్యం కావడం లేదు అనేది చెబుతున్నారు. అయితే ఇలాంటి పర్మిషన్స్ వరకు చూడకుండా కోర్ట్ ను లైట్ తీసుకుని ప్రీమియర్స్ వేస్తే తర్వాత ఎవరైనా కోర్ట్ లో కేస్ వేస్తే అది మొదటికే మోసం వస్తుంది. అందుకే రిలీజ్ రోజునే ఎర్లీ మార్నింగ్ షోస్ కు అనుమతి ఇస్తే సరిపోతుంది అని భావిస్తున్నారు. మరి ఈ రకంగా కేవలం తెలంగాణాలోనేనా లేక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఉంటుందా అంటే.. ఏపిలో అలాంటి సమస్యలేం ఉండవు అని టాక్. మొత్తంగా ఈ మూవీకి ప్రీమియర్స్ తెలంగాణలో దాదాపు అసాధ్యం అనేది మాత్రం తెలుస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
