సినీ నటి హేమకి షాక్.. క్రమశిక్షణ సంఘం నోటిసులు..!

సినీ నటి హేమకి షాక్..  క్రమశిక్షణ సంఘం నోటిసులు..!
సినీ నటి హేమ పై 'మా' క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంది. తాజాగా ఆమెకి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

సినీ నటి హేమ పై 'మా' క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంది. తాజాగా ఆమెకి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. 'మా' అధ్యక్షుడు నరేష్ పై, సభ్యుల పైన ఆమె ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలకి వివరణ ఇవ్వాలంటూ క్రమశిక్షణ సంఘం ఆదేశించింది. 'మా' అధ్యక్షుడు నరేశ్‌ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా 'మా' అధ్యక్షుడిగా నరేశ్‌ ని కొనసాగించేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని, మరికొందరు ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని హేమ ఆరోపించారు. అయితే హేమ వ్యాఖ్యలను ఖండించారు నరేశ్‌.. అసోసియేషన్‌ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ వ్యాఖ్యలున్నాయని, దీనిపైన క్రమశిక్షణ కమిటికి ఫిర్యాదు చేస్తామని, కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో హేమకు క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story