Akshay Kumar: భారీ బడ్జెట్‌ చిత్రం.. ప్రేక్షకులు లేక ప్రదర్శన నిలిపివేత

Akshay Kumar: భారీ బడ్జెట్‌ చిత్రం.. ప్రేక్షకులు లేక ప్రదర్శన నిలిపివేత
Akshay Kumar: అయ్యో రామ.. అక్షయ్ కుమార్ సినిమాకు ఎన్ని తిప్పలు వచ్చాయి.. భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Akshay Kumar: అయ్యో రామ.. అక్షయ్ కుమార్ సినిమాకు ఎన్ని తిప్పలు వచ్చాయి.. భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మేకర్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ప్రేక్షకులు ఈ సినిమాను సరిగా రిసీవ్ చేసుకోలేకపోయారు.. వచ్చి వారం రోజులు అయిందో లేదో ఒక్కరు కూడా థియేటర్ మొహం చూడలేదు. దీంతో థియేటర్ యాజమాన్యాలు సామ్రాట్ పృథ్విరాజ్ ప్రదర్శనను నిలిపివేశాయి.

అక్షయ్ కుమార్ నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ షోలు జీరో ఆక్యుపెన్సీ కారణంగా రద్దు చేయబడ్డాయి, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం 55 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేసింది.

బాలీవుడ్‌ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన చారిత్రాత్మక చిత్రం 'పృథ్వీరాజ్'. ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమా జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ఈ మూవీ వారానికే బాక్సాఫీసు వద్ద బోల్తా పడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.


థియేటర్లో ప్రేక్షకులు లేకపోవడంతో మూవీ ప్రదర్శనను నిలిపివేసినట్లు బి-టౌన్‌ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. చంద్రప్రకాశ్‌ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యశ్‌ రాజ్‌ ఫిలింస్ నిర్మించాయి. భారీ వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ సినిమాను రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.

పలు వాయిదాల అనంతరం రిలీజ్‌ అయిన ఈ మూవీపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదల అనంతరం ఈ చిత్రం ఆశించిన స్థాయితో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ మూవీకి ఇప్పటి వరకు రూ. 55 కోట్లు మాత్రమే వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.

ఇక మూవీపై పెద్దగా టాక్‌ లేని నేపథ్యంలో నేటి షో చూసేందుకు ఒక్కరు కూడా రాకపోవడంతో ఓ థియేటర్లో షోని రద్దు చేశారట. ఇక మరికొన్ని చోట్ల థియేటర్లో ఎక్కువ భాగం సీట్లు ఖాళీగా ఉండటంతో ఇక 'పృథ్వీరాజ్‌' సినిమా ప్రదర్శనను నిలిపివేశారంటూ వార్తలు వస్తున్నాయి. కాగా జూన్‌ 3న ఈ మూవీ హిందీ, తమిళంతో పాటు తెలుగులో విడుదలైంది.

Tags

Read MoreRead Less
Next Story