Shraddha Kapoor : లవ్ సీక్రెట్ రివిల్ చేసిన శ్రద్ధాకపూర్

Shraddha Kapoor : లవ్ సీక్రెట్ రివిల్ చేసిన శ్రద్ధాకపూర్

తాను ప్రేమలో పడ్డానని హింట్స్ ఇస్తోంది బాలీవుడ్ తార శ్రద్ధాకపూర్ (Shraddha Kapoor). రచయిత రాహుల్ మోడీతో (Rahul Modi) ఆమె ప్రేమలో ఉందట. ఈ జంట తమ సంబంధాన్ని అధికారికం చేసిందని భావిస్తున్నారు. శ్రద్ధా ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్ అభిమానులతో ఇంటరాక్షన్ చాలా సందేహాలకు తెర దించాయి. శ్రద్ధా రిలేషన్ షిప్ ఉన్నత దశలో ఉన్నట్లు కనిపిస్తోంది. మొదట అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు బయలుదేరినప్పుడు విమానాశ్రయంలో వీరిద్దరూ కలిసే ఫొటోలు దిగారు.

కొన్ని రోజుల క్రితం వారి సంబంధానికి ఇరువైపులా కుటుంబాలు తమ ఆమోదం తెలిపాయని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆశ్చర్యకరంగా శ్రద్ధా స్వయంగా రాహుల్ మోడీతో అనుబంధంపై లీకులు ఇచ్చింది. ఇటీవల అభిమానితో సంభాషణల సమయంలో శ్రద్ధా స్పందన సందేహాలకు తావిచ్చింది. శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో తన అభిమానులతో నిరంతరం ఇంటరాక్ట్ అవుతుంది. ఇటీవల శ్రద్ధా తన నైట్ సూట్ లో బద్ధకంగా పడుకున్న ఫొటోలను పోస్ట్ చేసింది.

ఏమీ చేయకుండా ఆ రోజును ఎంజాయ్ చేయడంపై వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. శ్రద్ధ ధరించిన లాకెట్ లో R అనే అక్షరం ఉంది. ఇది సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ రాహుల్ ఇనీషియల్ అయి ఉండవచ్చనే ఊహాగానాలకు దారితీసింది. నిజానికి R అంటే రిచర్డ్ అని ఒక అభిమాని సరదాగా ప్రశ్నించగా, శ్రద్ధా వెంటనే నో అని ప్రతిస్పందించింది. లాకెట్టులో ఉన్న R వేరొకదానిని సూచిస్తుంది తెలిపింది. దీంతో రాహుల్ మోడీ, శ్రద్ధాకపూర్ పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

Read MoreRead Less
Next Story